రవితేజ హీరోగా తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం టీజర్ ను ఇటీవల విడుదల చేశారు. ఒకప్పుడు రాష్ట్రాన్నే కాకుండా యావత్ దేశాన్ని వణికించిన స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా నిర్మిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో రవితేజ టైటిల్ రోల్ చేస్తున్నారు. దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు.  ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూవీలో రవితేజకు జంటగా నుపుర్ సనన్ నటిస్తోంది. నటి రేణూ దేశాయ్ ఈ చిత్రంతో కమ్ బ్యాక్ ఇస్తూ... కీలకరోల్ లో నటించారు. మురళీ శర్మ, అనుపమ్ ఖేర్ వంటి టాలెంటెడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు. అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఇప్పుడు ఈ చిత్రం ఎందుకు చర్చనీయాంశం అయిందంటే...  టైగర్ నాగేశ్వరరావు మూవీ టీజర్ ఎరుకల సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతీసేదిగా ఉందని చుక్కా పాల్ అనే వ్యక్తి  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో పాటు... ఈ మూవీ విడుదల నిలిపి వేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన ఏపీ హైకోర్టు... టైగర్ నాగేశ్వరరావు చిత్రం టీజర్ లో వాడిన భాష ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందని  సీరియస్ అయ్యింది. సరైన అనుమతులు తీసుకోకుండా ఎలా  విడుదల చేస్తారని మండిపడింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనుమతి లేకుండా టీజర్ విడుదల చేయడంపై అభ్యంతరం తెలిపింది. ఇలాంటి టీజర్స్ ద్వారా సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించింది. సినిమా మేకర్స్ సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని... కేవలం డబ్బుల కోసం సినిమాలు తీయడం సరికాదని చెప్పింది. ఈ మేరకు చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ కి నోటీసులు జారీ చేసింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్ పర్సన్ ని ప్రతివాదిగా చేర్చాలని సూచించింది. అలాగే సినిమాపై పిటిషనర్ కి ఉన్న అభ్యంతరాలు అన్నింటినీ సీబీఎఫ్సీ చైర్ పర్సన్ కి తెలియజేసేలా అనుమతి ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ ఠాకూర్, న్యాయమూర్తి ఆకుల శేషసాయిమూర్తి ఆదేశాలు జారీ చేశారు.  ఇప్పుడు హైకోర్టు తీర్పుతో టైగర్ నాగేశ్వరరావు మూవీ నిర్మాతకు, టీమ్ కు పెద్ద చిక్కు వచ్చి పడిందని ఫిల్మ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లొ మూవీ నిర్మాత ఎలా ముందుకు వెళతారనేది ఉత్కంఠగా మారింది. ఏం జరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos