నిన్నమొన్నటివరకు అందుబాటులో ఉన్న టమోటాల ధరలు ... ఇప్పుడు అమాంతంగా పెరగడంతో ఎన్నెన్ని సీన్లు క్రియేట్ చేసిందో మనం చూశాం. టమోటాల లోడుతో ఉన్న వాహనాలను దారికాచి దోపిడీ చేయడం... హత్యలు... భార్యభర్తల మధ్య గొడవలు జరగడం వంటి ఘటనలు సైతం చోటు చేసుకున్నాయి. టమోటా ధరలు ఆకాశాన్నంటుతున్న క్రమంలో.. ఇప్పుడు ఫుడ్ కోసం ఆన్ లైన్ లో బుక్ చేసే కొన్ని రెస్టారెంట్లలో సైతం ... వాటిని పక్కన పెట్టేశారు. ఇప్పటికే మెక్ డొనాల్డ్స్ ఆ దారిలో ఉంది. అదే కోవలోకి ఇప్పడు సబ్‌వే ఇండియా సంస్థ కూడా వెళుతోంది. ఆ సంస్థకు చెందిన ఔట్‌లెట్స్‌లో ... సలాడ్స్ మరియు శాండ్‌విచ్‌లలో టమాటా వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.
నాణ్యతా సమస్య కారణంగా టమోటా వినియోగాన్ని నిలిపివేసినట్లు న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్, చెన్నై సహా పలు ప్రధాన నగరాల్లో కొన్ని సబ్‌వే ఔట్‌లెట్‌లలో డిస్ ప్లే బోర్డులు సైతం పెట్టారు. ప్రస్తుతం టమోటాల నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా తగినంత టమాటాలను సోర్స్ చేయలేకపోతున్నామని ఆ సంస్థ పేర్కొంది. ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్‌లోని సబ్‌వే స్టోర్ లో 'టమాటాలు తాత్కాలికంగా అందుబాటులో లేవు' అని కస్టమర్లకు బోర్డును ప్రదర్శించింది. మొత్తమ్మీద.. టమాటా ధరలు దేశంలోని పలు ఫాస్ట్ ఫుడ్ చైన్‌లను ప్రభావితం చేశాయి. మెక్‌డొనాల్డ్స్ ఇటీవల తమ మెనూ నుండి, బర్గర్ నుండి టమాటాను తొలగించిన సంగతి తెలిసిందే. అకాల వర్షాలు, రవాణాలో అంతరాయం కారణంగా టమాటా ధర భారీగా పెరిగింది. ఇటీవల ఢిల్లీలో కిలో టమాటా ధర రూ.240కి చేరుకుంది. ప్రస్తుతం అది రూ.170 దిగువకు వచ్చింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos