ఏపీలోని పుంగనూరు నియోజకవర్గం అంగళ్లు ఘటన కేసులో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ దాఖలు చేయడాన్ని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై మంగళవారంనాడు సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వుల విషయంలో తాము కలగజేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఆరు వేర్వేరు పిటిషన్లను కొట్టివేయడమే కాకుండా... టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను సమర్థించింది. ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంపై న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. భద్రత కల్పించే పోలీసులే.. సాక్షులుగా ఎఫ్‌ఐఆర్‌ లో ఉండటమేమిటని ధర్మాసనం ప్రశ్నించింది. పోలీసు అధికారులు గాయపడ్డారని, ఓ కానిస్టేబుల్ ఫిర్యాదుదారుగా ఉన్నారని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. పోలీసులే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి పోలీసులే సాక్షులుగా ఉంటారా అని ధర్మాసనం ప్రశ్నించింది.  హైకోర్టు బెయిల్‌ ఇచ్చింది కాబట్టి దానిలో జోక్యం చేసుకోడానికి ఏమీ లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో మాజీమంత్రి దేవినేని ఉమా,  టీడీపీ నేతలు పులివర్తి నాని, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అంగళ్లులో ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.  ఇచ్చిన రూట్ లో కాకుండా చంద్రబాబు మరో రూట్ లో రావడంతోనే ఘర్షణలు చోటు చేసుకొన్నాయని పోలీసులు ఆరోపించారు. చంద్రబాబు వెళ్లే రూట్ లో వైసీపీ కార్యకర్తలు బస్సును అడ్డుగా పెట్టి... యాత్రను అడ్డగించినందువల్లనే ఈ ఘర్షణ చోటు చేసుకుందని టీడీపీ ఆరోపించింది. ఈ ఘర్షణకు సంబంధించి 200 పైగా టీడీపీ కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో చంద్రబాబు సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టయిన టీడీపీ నేతలు, కార్యకర్తలు 79 మందికి న్యాయస్థానం ఈ ఏడాది సెప్టెంబర్ 21న బెయిల్ మంజూరు చేసింది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos