హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటోంది. ఈ ఉత్సవాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పాల్గొంటున్నారు. ఆయన రేపు అంటే 23న బుధవారం ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో విద్యార్థులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. ట్రిపుల్ ఐటీ ఆవిర్భావం, ఐటీ రంగ అభివృద్ధి వంటి అంశాలపై విద్యార్థులతో చర్చించనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉమ్మడి ఏపీకి దాదాపు పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఇది మరో అరుదైన గౌరవంగానే చెప్పవచ్చు. ఏపీ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో... 1998లో హైదరాబాద్ లో త్రిపుల్ ఐటీ ఏర్పాటైంది. ఈ సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న క్రమంలో ఆయన్ను ఆహ్వానించారు. హైదరాబాద్ అభివృద్ధికి ఐటీ రూపంలో చంద్రబాబు వేసిన బీజాలు... అవి ఈ సంస్ధ ఆవిర్భావానికి ఎలా పనికొచ్చాయన్న అంశాలపై ఉపన్యాసం ఇచ్చేందుకు ఆ సంస్థ తరపున ఆహ్వానించారు. ట్రిపుల్ ఐటీ ఆవిర్భావం, ఐటీ సెక్టార్ గ్రోత్ వంటి అంశాలపై విద్యార్థులతో చర్చ లో చంద్రబాబు పాల్గొంటారు. ఇందులో ఇప్పటివరకూ వేలాదిమంది విద్యార్ధులు పాసవుట్ అయి కీలక ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న త్రిపుల్ ఐటీల్లో హైదరాబాద్ కూడా గొప్ప సంస్థగా పేరు తెచ్చుకుంది. ఇందులో చంద్రబాబు కృషి ఉన్న నేపథ్యంలో ఆయన్ను రేపటి సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా యాజమాన్యం కొన్ని రోజులుగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos