ఏపీలో ఎన్నికలకు సిద్ధం అవుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ ఇచ్చే వార్త ఒకటి వెలుగులోకి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ... ఇన్ ఫ్రా కంపెనీల సబ్ కాంట్రాక్టుల ద్వారా రూ.118 కోట్లు ముడుపులు తీసుకున్నారనే అభియోగాల కింద ఆయనకు ఆదాయపు పన్నుశాఖ నోటీసులు జారీ చేసినట్లు ఒక ప్రముఖ జాతీయ దినపత్రిక పేర్కొంది. అసలు ఆ పత్రికలో రాసినట్లుగా చంద్రబాబుకు నిజంగానే ... ఐటీశాఖ నోటీసులు జారీ చేసిందా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో వెల్లడించని ఆదాయంలో రూ.118 కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పాలని ఐటీ శాఖ ఆదేశించిందని ... షోకాజ్ నోటీసుల పై చంద్రబాబు అభ్యంతరాలను ఐటీ శాఖ తిరస్కరించినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. 2014-19 మధ్య కాలంలో ఏపీలో కాంట్రాక్టులు నిర్వహించిన మౌలిక సదుపాయాల కంపెనీల నుంచి చంద్రబాబు రూ.118 కోట్ల రూపాయలు ముడుపులు అందుకున్నారని ఐటీ శాఖ అనుమానిస్తోంది. నాలుగేళ్లుగా సాగుతున్న దర్యాప్తునకు చంద్రబాబు ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని ఐటీ శాఖ ఆగస్టు 4న నోటీసులు జారీ చేసింది. ఐటీ నోటీసులపై చంద్రబాబు స్పందించలేదు. కాంట్రాక్టు సంస్థల నుంచి మళ్లించిన ఆదాయాన్ని చంద్రబాబు ‘వెల్లడించని ఆదాయం’గా పరిగణిస్తూ ఐటీ శాఖ నోటీసులను జారీ చేసింది. ముడుపుల రూపంలో ఈ డబ్బులు అందుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ లావాదేవీలపై విచారణ జరుపుతున్నారు. చంద్రబాబు గతంలో ఇచ్చిన వివరణలను తోసిపుచ్చిన ఐటీ శాఖ ఆగస్టు 4వ తేదీన హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ తాజా నోటీసులు జారీ చేసింది. గతంలో ఐటీ శాఖ ఉపక్రమించిన చర్యలపై చంద్రబాబు ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని ఐటీ శాఖ వీటిని ఇచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆదాయ ధృవీకరణలపై పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తోంది. అమరావతి కాంట్రాక్టర్లు అయిన షాపూర్ జీ పల్లోంజి - ఎస్ పి సి ఎల్, ఎల్ అండ్ టీ సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు 118 కోట్ల ముడుపులు అందాయనేది ఆరోపణగా ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్ధసాని నివాసాల్లో తనిఖీల సమయంలో ఈ విషయం బయటకు వచ్చినట్లు చెబుతున్నారు. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు మనోజ్ వాసుదేవ్ ఒప్పుకున్నారని వివరించారు. మనోజ్ వాసుదేవ్ నివాసంలో సోదాల సమయంలో భారీగా సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాల్లో లభించిన ఆధారాల మేరకు సంబంధిత వ్యక్తులను విచారించారు. తాము సేకరించిన సమాచారం పై వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. వీటి ఆధారంగా ఐటీ అధికారులు ఇప్పుడు చంద్రబాబుకు నోటీసులు పంపినట్లు ఆ పత్రిక ఆ కథనంలో పేర్కొంది. అసలు చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చారన్నది ఏ మేరకు వాస్తవమో తేలాల్సి ఉంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos