చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ... సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఆరు మాసాల జైలుశిక్షను విధించింది. జయప్రదతో పాటు మరో ముగ్గురికి కూడా జైలు శిక్ష విధించిస్తూ తీర్పు చెప్పింది. అంతేకాదు ఒక్కొక్కరికి రూ.5 వేల జరిమానాను కూడా విధించింది. చైన్నైలోని రాయపేటలో జయప్రదకు చెందిన థియేటర్ కార్మికుల కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. రాయపేటలో జయప్రదకు ఓ సినిమా థియేటర్ ఉంది. చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో పాటు జయప్రద ఈ థియేటర్ ను నడిపారు. ప్రారంభంలో బాగానే నడిచినా తర్వాతి కాలంలో థియేటర్ నష్టాల్లో కూరుకుపోవడంతో దాన్ని మూసివేశారు. అయితే... థియేటర్ లో పనిచేసిన కార్మికుల నుండి వసూలు చేసిన ఈఎస్ఐ మొత్తాన్ని చెల్లించలేదు. దీనిపై ఇటు కార్మికులు, అటు కార్పొరేషన్ ఎగ్మూరు కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ ను కొట్టివేయాలని జయప్రద మూడు పిటిషన్లను దాఖలు చేయగా ... హైకోర్టు కొట్టివేసింది. కార్మికుల పిటిషన్ పై విచారించిన కోర్టు ... జయప్రదతో పాటు మరో ముగ్గురికి ఆరు మాసాల జైలు శిక్షను విధించింది. కాగా... టీడీపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన జయప్రద... కొంతకాలం తర్వాత ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె సమాజ్ వాదీ పార్టీలో చేరారు. సమాజ్ వాదీ పార్టీకి కూడా గుడ్ బై చెప్పి ... ఆ తరువాత బీజేపీలో చేరారు. కాగా.... ఈ కేసు విచారణ సందర్భంగా కార్మికులకు చెల్లించాల్సిన మొత్తాన్ని బయట సెటిల్ చేసుకుంటామని, ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించేందుకు సిద్ధమని జయప్రద తరఫున లాయర్ కోర్టుకు వెల్లడించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos