ఏపీలో పవన్ కళ్యాణ్... వారాహి యాత్ర మొదలుపెట్టిన తరువాత.. కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయ కాక రేపుతోంది. పవన్... రాజకీయ యాత్ర చేస్తూ సర్పవరం జంక్షన్ లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద చేసిన హాట్ కామెంట్స్ హీట్ ఇప్పటికీ తగ్గడం లేదు. చంద్రశేఖరరెడ్డిని రాజకీయంగా ఓడించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని పవన్ అతి పెద్ద సవాల్ చేయడం... పవన్ మెడకు చుట్టుకుంది.
అయితే ... నాపై పోటీ చేసే దమ్ము నీకుందా.... పోటీ చేసి గెలవగలవా అని ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కి రివర్స్ సౌండ్ వినిపించారు. ఆ సౌండ్ కు పవన్ చెవులు గింగురమన్నాయో ... ఏమోకానీ... చంద్రశేఖరరెడ్డికి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా... నెమ్మదిగా కాకినాడ నుంచి తప్పుకొని ... ఇతర ప్రాంతాల యాత్రకు తుర్రుమన్నారు. దీంతో చంద్రశేఖరరెడ్డి ఆ మరుసటి రోజు కూడా అదే సౌండ్ చేసి పవన్ కు సవాల్ చేశారు. కాకినాడ వదిలి వెళ్తున్న పవన్ తన సవాల్ ని స్వీకరించలేదని ద్వారంపూడి అన్నారు. తన మీద పోటీకి పవన్ కి పర్మిషన్ చంద్రబాబు నుంచి రావాల్సి ఉందని కూడా ఎద్దేవా చేశారు.
అయితే దీనికి జనసేన కాకినాడ నేతల నుంచి ద్వారంపూడికి ... ఉత్తరకుమారుని ప్రగల్బాలతో కూడిన రెస్పాన్స్ వచ్చిందని వైసీపీ నేతలు అంటున్నారు. కాకినాడ సిటీ నుంచి ముత్తా శశిధర్ అనే వ్యక్తి పోటీ చేస్తారట... వైసీపీ నుంచి ఏకంగా సీఎం జగన్ పోటీకి దిగాలంటూ... మాట్లాడారు. ద్వారంపూడి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తా శశిధర్ కి పోటీ చేయడానికి సరితూగరా అని ఒక ప్రశ్న వస్తోంది.
జనసేన వారివి ఉత్తి ప్రగల్బాలు కాకపోతే... వైసీపీలో కొన్నాళ్ళు ఉన్న ముత్తా శశిధర్ ... ఏకంగా అధినేత జగన్నే ఓడిస్తారా అని వైసీపీ నేతలు అంటున్నారు. ద్వారంపూడి అవినీతిపరుడు అని ఆయన రాజకీయ జీవితం సమాప్తం అని పవన్ అన్నారు కాబట్టే ఎమ్మెల్యే సవాల్ చేశారని మధ్యలో జగన్ ప్రస్తావన ఎందుకు అని వారు అంటున్నారు. మొత్తానికి చూస్తే కాకినాడ సిటీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి జగన్ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ నేరుగా ఢీ కొంటారా అన్నదే చర్చగా ఉంది. పవన్ ... గోదావరి జిల్లాల్లో పోటీ చేస్తే కాకినాడ సిటీని ఎంచుకోవాలని ద్వారంపూడి సవాల్ చేస్తున్నారు. వారాహి యాత్ర ముగుస్తున్న క్రమంలో... పవన్... ద్వారంపూడి సవాల్ ను స్వీకరిస్తారా...లేక.. తోక ముడుచుకుని నిశ్శబ్దంగా జారుకుంటారా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పవన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలిమరి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos