తెలంగాణ సీఎం కేసీఆర్‌ ... బీఆర్ఎస్ స్థాపించిన అనంతరం ... జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఇందులోభాగంగా ఇప్పటికే ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభించడమే కాకుండా... పొరుగు రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించేవిధంగా ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఏపీలో రాష్ట్ర కార్యాలయం ప్రారంభించి ... ఆ రాష్ట్ర అధ్యక్షున్ని నియమించారు. ఇక మహారాష్ట్రలో అయితే పొలిటికల్ గా మరింత వేగం పెంచి ఆ రాష్ట్ర రాజకీయాల్లోకి పూర్తిగా చొచ్చుకుపోతున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే ఆ రాష్ట్రంలో మూడుసార్లు బహిరంగ సభలు నిర్వహించి .. కొందరు నేతలను పార్టీలో చేర్చుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ఇప్పుడు ... తాజాగా మరోసారి మహారాష్ట్రకు వెళ్లారు. ఉదయం హైదరాబాద్ లోని నెక్లెస్‌ రోడ్డులో ఏర్పాటుచేసిన 108, 102 అంబులెన్స్‌లను ప్రారంభించిన కేసీఆర్ ఆ తర్వాత బేగం పేట విమానాశ్రయం నుంచి మహారాష్ట్ర బయల్దేరి వెళ్లారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ ఎయిర్ పోర్టులో కేసీఆర్ కు బీఆర్ఎస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుండి కేసీఆర్ నేరుగా కొల్హాపూర్ లోని మహాలక్ష్మి  మాతా అంబాబాయి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలోని వాటేగావ్ గ్రామంలో  ప్రముఖ సంస్కర్త అన్నాబావూ సాఠే జయంతి వేడుకల్లో కూడా పాల్గొన్నారు. అన్నా బాపూ  బంధువుల  ఇంటికి వెళ్లిన కేసీఆర్... అన్నాబావూ సాఠే విగ్రహనికి నివాళులర్పించారు.
కొల్హాపూర్ లోని  సాధు మహారాజ్ సమాధి వద్ద నివాళులర్పించారు. కాగా.. మహారాష్ట్రలో  బీఆర్ఎస్ ను బలోపేతం  చేసేందుకు  కేసీఆర్ పలు చర్యలు చేపట్టారు. బీఆర్ఎస్ కమిటీలను ఏర్పాటు చేశారు.  మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో కమిటీలను ఏర్పాటు చేశారు.  మహారాష్ట్ర పర్యటనపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో వరదలతో నష్టపోయిన మోరాంచపల్లికి సీఎం వెళతారనుకుంటే... మహారాష్ట్రకు వెళ్లారని ... మోరంచపల్లి ప్రజలు దీనావస్థలో ఉన్నారనే విషయాన్నే కేసీఆర్ మరిచిపోయారని మండిపడ్డారు. తొమ్మిదేళ్లలో పాతబస్తీకి 5.5 కిలో మీటర్ల మెట్రో లైన్ పూర్తి చేయడం ప్రభుత్వానికి చేతకాలేదని... నాలుగేళ్లలో మెట్రో రైలును భాగ్యనగరం చుట్టూ విస్తారింపచేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. రియల్ ఎస్టేట్ ను పెంపొందించేందుకు భాగ్యనగరం చుట్టూ మెట్రో అంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని... కేసీఆర్‌కు ఓట్లు సీట్లు తప్ప వేరే ధ్యాస లేదని ఎమ్మెల్యే విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం... కడెం ప్రాజెక్టు అభివృద్ధి కోసం కమిటీ వేసి నివేదిక తెప్పించుకుంది కానీ... ప్రాజెక్టును పరిశీలించేందుకు ... కనీసం మంత్రులు కూడా వెళ్లకపోవడం శోచనీయమని అన్నారు. కడెం ప్రాజెక్టు అభివృద్ధికి ముఖ్యమంత్రి వద్ద 30 శాతం నిధులు లేవని ... ఒక్క నెలలోనే మూడురకాల పరీక్షలు పెట్టి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని రఘునందన్ రావు అన్నారు.
మంత్రివర్గ సమావేశంలో పరీక్షల నిర్వహణ తేదీల మార్పుపై నిర్ణయం తీసుకుంటారనుకున్నామని అన్నారు. ఐదుగంటల పాటు జరిగిన చిట్ట చివరి మంత్రివర్గ సమావేశంలో ఏమి చర్చించారని ప్రశ్నించారు. ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని.. ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు కేటీఆర్ గొప్పగా చెప్పారని... ముందు... ఆర్టీసీ ఆసుపత్రి బకాయిలు చెల్లించాలని హితవు పలికారు. ప్రభుత్వంలో విలీనం చేసుకుని ఆర్టీసీ భూములను లీజుకు ఇవ్వాలని కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఎమ్మెల్యేల ఒక నెల జీతాన్ని వరద బాధితుల కోసం ఇవ్వాలని... ఈ మేరకు కేసీఆర్ నిర్ణయం తీసుకోవాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. దీనిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos