తెలంగాణలోని సిరిసిల్ల నేతన్న దశ మారనుంది. రెండు రాష్ట్రాల్లోనూ త్వరలో జరగనున్న ఎన్నికలు నేతన్నలకు వరాలు కానున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నేతన్నలకు గిరాకీ పెరనుంది. రాజకీయ పార్టీల జెండాలు, నేతలు వినియోగించే కండువాల తయారీకి వివిధ పొలిటికల్ పార్టీల నుంచి కుప్పలు తెప్పలుగా ఆర్డర్లు వస్తుండటంతో ఇక్కడి చేనేత కార్మికులకు చేతినిండా పని దొరుకుతున్నది. తెల్లని వస్త్రాన్ని ఉత్పత్తి చేసి దానిపై వివిధ పార్టీల నాయకుల గుర్తులు, ఫొటోలతో పూర్తి స్థాయి జెండాలు, కండువాలు సిరిసిల్లలో తయారవుతున్నాయి. ఎన్నికల సందడితో చేనేత కార్మికులకు చేతినిండా ఉపాధి లభిస్తుండటంతో... ఇక్కడి కార్మికులందరూ హ్యాపీ హ్యాపీగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీల ఆర్డర్లు సిరిసిల్ల నేతన్నలకు ఇప్పటికే చాలా ఆర్డర్లు అందాయి. రెండు రోజుల కిందట అందిన ఆర్డర్లతో సిరిసిల్ల నేత కార్మికులు ఉత్పత్తి పనులు ప్రారంభించారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 5 లక్షల మీటర్ల ఆర్డర్లను ఇచ్చింది. వైసీపీ కూడా 5 లక్షల మీటర్ల ఆర్డర్లను ఇచ్చినట్లు సమాచారం. చేనేత కార్మికులు పార్టీ జెండా తయారీకి మీటరున్నర వస్త్రం, కండువా తయారీకి మీటర్ వస్త్రాన్ని వాడుతున్నారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్, వైసీపీ పార్టీలకు సంబంధించిన జెండాలు, కండువాలను తయారు చేస్తున్నారు. జెండాలు తయారు చేసే నేతన్నలు రూ.9 చొప్పున మీటరు వస్త్రాన్ని కొనుగోలు చేస్తారు. దీనికి ప్రింటింగ్ కోసం రూ.8. ఖర్చవుతుంది. ఒక జెండా తయారీకి 17 రూపాయలు ఖర్చవుతుంది. ఉత్పత్తిదారులు ఈ జెండాలను రూ.18నుంచి రూ.19కి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం జెండాల తయారీతో సిరిసిల్లలో దాదాపు 500 మంది నేత కార్మికులు ఉపాధి పొందుతున్నారు. జెండాల తయారీ కార్ఖానాలో కార్మికులు జెండాలను కట్ చేస్తూ రోజుకు రూ.500 నుంచి రూ.700 వరకు సంపాదిస్తున్నారు. జెండాలను స్టిచింగ్ చేసే కార్మికులు రోజుకు వెయ్యి రూపాయల చొప్పున సంపాదిస్తున్నారు. ఇంకా ఆర్డర్లు పెరిగితే ఈ ఉపాధి.. ఇంకా పెరుగుతుంది. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 115 మందిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించినందున... ఇప్పటివరకు ఆ పార్టీకి సంబంధించిన ఆర్డర్లు మాత్రమే అందాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్సీ తదితర పార్టీలు సైతం తమ అభ్యర్థులను ప్రకటించిన వెంటనే ఆర్డర్లు వస్తాయని తయారీదారులు చెబుతున్నారు. ఇదిలావుండగా... పలు జిల్లాలకు చెందిన ప్రింటింగ్ వ్యాపారస్తులు ఎమ్యెల్యే అభ్యర్థుల ఆర్డర్లు తీసుకుని ... అవి తయారైన తరువాత... ఎమ్యెల్యే అభ్యర్థులకు సప్లై చేస్తారు. నేరుగా ఎమ్యెల్యే అభ్యర్థులతోనే కాకుండా... ఇలా మధ్యవర్తులతో కూడా కొన్ని ఆర్డర్లు వస్తుంటాయని నేతన్నలు, కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి సిరిసిల్ల నేతలన్నలకు రెండు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీల నుంచి పది లక్షల ఆర్డర్లు వరకు వచ్చాయి. అన్నిపార్టీలు... ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన తరువాత ఇంకా భారీమొత్తంలో ఆర్డర్లు వస్తాయని... అప్పడు మాకు చేతినిండా ఉపాధితో పాటు జేబునిండా డబ్బు ఉంటుందని నేతన్నలు ఖుషీఖుషీగా చెబుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos