ఈ లోకంలో ఇప్పటివరకు పిల్లలను, మహిళలను, సంపన్నులను కిడ్నాప్ చేయడం...  కిడ్నాపర్లు  బాధితులను డబ్బు డిమాండ్ చేయడం వంటి ఘటనలు విన్నాం. ఇప్పుడు విచిత్రంగా... వ్యక్తులను కాదు... ఏకంగా టమోటా వాహనాన్నే కిడ్నాప్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకే... మన పెద్దలు... అంటే.. మన పూర్వీకులు ఎప్పుడూ ఒకమాట చెబుతూ ఉంటారు. అంతా కలికాలం అని. ఇలాంటి సంఘటనల గురించి వింటే మననోటి నుంచి కూడా  ఆటోమేటిక్ గా అవును అంతా కలికాలం అనే మాట వస్తుంది. సరే.. అసలు విషయానికొద్దాం. నిన్నమొన్నటి వరకు అతి చీప్ గా లభ్యమైన టమోటాలు ఇప్పుడు ధరలు ఆకాశాన్నంటుతూ కేవలం సంపన్నులు మాత్రమే కొనగలిగే స్థాయిలో ఉన్నాయనేది తెలిసిందే కదా. టమోటాకు భలే డిమాండ్ ఉండటంతో అక్కడక్కడా చోరీలు కూడా జరిగాయి. ఇప్పుడు ఏకంగా... టమోటాను తరలిస్తున్న వాహనాన్ని కిడ్నాప్ చేసి ... దుండగులు టమోటాను విక్రయించుకుని సొమ్ము చేసుకున్న ఘటనల వెలుగులోకి వచ్చింది. 

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో చల్లకెరె తాలూకా రేణుకాపురకు చెందిన ఇద్దరు రైతులు రూ. 2 లక్షలకు పైగా విలువ చేసే టమోటాలను విక్రయించడానికి ... కోలారు ఏపీఎంసీ మార్కెట్‌కు ... మహీంద్రా పికప్ వాహనం ద్వారా  తరలిస్తుండగా గురగుంటపాళ్య రింగ్ రోడ్డు వద్ద ... ఆ వాహనం ఓ కారును ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. వెంటనే కారులో ఉన్నవారు కిందకు దిగి టమోటా రైతులపై గొడవకు దిగి...  కారు రిపేర్ చేయించాలని టమోటా రైతులను డిమాండ్‌ చేశారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని రైతులు, వాహనం డ్రైవర్ చెబుతున్నా ఆ కారులో ఉన్న వాళ్లు వినిపించుకోకుండా బెదిరించారు. డబ్బులు ఇవ్వడానికి రైతులు నిరాకరించడంతో రగిలిపోయిన గుర్తు తెలియని వ్యక్తులు వాహనంలో ఉన్న టమోటాలు అమ్మి కారు రిపేరు చేసుకుంటామని చెప్పి ఆ వాహనంతో సహా పరారయ్యారు. దీంతో రైతులు తమ యజమానికి ఫిర్యాదు చేశారు. టమోటా పంటల యజమాని సూచన మేరకు రైతులు బెంగళూరులోని ఆర్‌ఎంసీ యార్డు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టి .. నిందితుల కోసం గాలిస్తున్నారు. అసలు ఇక్కడ వాహనం ఢీ కొట్టడం కూడా వాస్తవం కాదని... కారులోని గుర్తుతెలియని వ్యక్తులే వాహనం ఢీకొట్టినట్లుగా కథ అల్లారని వినికిడి. ఇదండీ టమోటా వాహనం కిడ్నాప్ కథ. టమోటాలను కూడా కిడ్నాప్ చేయడమేమిటీ అని.. జనాలు నోరెళ్లబెట్టి... అదేమరి కాలమహిమ అంటూ గుసగుసలాడుకుంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos