తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంటా... ఇప్పుడు బిగ్ బాస్ షో కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటోంది. సుమారు వారం కిందట ఉల్టాపుల్టాగా వెరైటీగా ప్రారంభమైన ఈ షో నుంచి అనూహ్యంగా... అప్పుడే ఎలిమినేషన్లు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో... ఎన్నో హోప్స్ తో హౌస్ లోకి అడుగు పెట్టిన కిరణ్ రాథోడ్ ... వారం రోజుల్లోనే ఎలిమినేట్ అయింది. హౌస్ లో ఉన్నది తక్కువ రోజులే అయినా బాగానే రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తోంది. కిరణ్‌ రాథోడ్‌ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు వెండితెరపై పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. 'అందరూ దొంగలే దొరికితే..', 'భాగ్యలక్ష్మి బంపర్‌డ్రా', 'హై స్కూల్‌', 'కెవ్వు కేక' లాంటి చిత్రాలతో తెలుగు సినీ అభిమానులను అలరించింది. 2016లో తమిళంలో ఆమె నటించిన చిత్రం తెలుగులో 'భాజాభజంత్రీలు' పేరుతో విడుదల అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆమె మళ్లీ కనిపించలేదు. సుమారు ఏడు సంవత్సరాల తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది కిరణ్ రాథోడ్. ఈ షో ద్వారా  మంచి గుర్తింపు తెచ్చుకోవాలని... ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆమె ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చింది. కానీ, ఆమె ఆశ నెరవేరకుండానే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. వారం రోజుల్లోనే షో నుంచి ఎలిమినేట్ అయ్యింది. హౌస్ లో ఉన్నది తక్కువ రోజులే అయినా, రెమ్యునరేషన్ బాగానే అందుకున్నట్లు టాక్ నడుస్తోంది. కాగా... కిరణ్‌ రాథోడ్‌ బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఫస్ట్ పాయింట్ ఆమెకు తెలుగు భాష రాదు. ఆ ఒకే ఒక్క కారణంగా హౌస్ మేట్స్ ఆమెను నామినేట్ చేశారని తెలుస్తోంది. అయితే, నిజానికి ఆమె తెలుగు రాకపోయినా, హౌస్ లో మిగతా భాషల్లో చక్కగానే మాట్లాడింది.  అయితే... తెలుగు భాష రాకపోవడంతో తోటి కంటెస్టెంట్లతో సరిగా కలిసి ఉండలేకపోయింది. టాస్కుల విషయంలో యాక్టివ్ గా ఉన్నా, హౌస్ లో తన ప్రభావం అంతంత మాత్రమే అన్నట్లుగా కనిపించింది. పైగా... బుల్లితెర ప్రేక్షకుల నుంచి కూడా ఆమెకు పెద్దగా సపోర్టు దొరకలేదు. ఓట్లు కూడా తక్కువే వేశారు. కారణాలు ఏవైనా షో నుంచి ఆమె బయటకు వెళ్లిపోయింది.  హౌస్ లో కిరణ్ రాథోడ్ ఉన్నది తక్కువ రోజులే అయినా, సంపాదన విషయంలో మాత్రం ఆకట్టుకుంది. షోలో వారం రోజులు ఉన్న ఆమెకు రోజుకు రూ. 45 వేల చొప్పున బిగ్ బాస్ నిర్వాహకులు పారితోషికం అందించారట. అంటే వారం రోజులకు గాను రూ.3 లక్షలకు పైనే ఆమె సంపాదించింది. అయితే, కిరణ్ కు మరో వారం రోజుల పాటు అవకాశం ఇచ్చి ఉంటే తన ఆటతీరులో మార్పు వచ్చేదనే టాక్ నెటిజన్లలో వినిపిస్తోంది. మొత్తంగా కిరణ్‌ రాథోడ్‌ ను బిగ్ బాస్ షో లోకి  ఎందుకు తీసుకొచ్చారో? ఎందుకు వారం తిరగకుండానే ఎలిమినేట్ చేశారనేది మాత్రం ఎవ్వరికీ అర్థం కావడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos