రక్షా బంధన్‌ - రాఖీ పర్వదినం సందర్భంగా ఏపీ రాష్ట్రంలోని అక్కా చెల్లెళ్లకు టీడీపీ యువనేత నారా లోకేశ్ శుభాకాంక్షల తెలిపారు. సొంత అక్కాచెల్లెళ్లు లేని తనకు ల‌క్షలాది మంది తోబుట్టువుల‌ను దేవుడిచ్చాడని అన్నారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర సంద‌ర్భంగా ప్రతీ ఊరిలోనూ నా అక్కాచెల్లెళ్లు రాఖీలు క‌ట్టారని... అవ్వ, అమ్మమ్మలంతా చ‌ల్లగా ఉండాల‌ని ఆశీస్సులు అందించారని... నా ఆయురారోగ్యాల కోసం మ‌హిళ‌లంతా హార‌తుల‌తో నీరాజ‌నాలు ప‌ట్టారని... మీ అంద‌రి ప్రేమాభిమాన ఆప్యాయ‌త‌లు పొందుతున్న నేను ఎంతో అదృష్టవంతుడినని అన్నారు. ఆడ‌ప‌డుచుల‌కి అన్న ఎన్టీఆర్ ఆస్తిహ‌క్కు క‌ల్పించారని... చంద్రన్న మ‌హిళ‌ల‌ను మ‌హాశ‌క్తిగా తీర్చిదిద్దారని అన్నారు. టీడీపీ మార్గదర్శకుల‌ బాట‌లోనే మీ ర‌క్షణ, శ్రేయ‌స్సు కోసం కృషి చేయ‌డం నా బాధ్యత‌ అని... సోద‌రీమ‌ణులంద‌రికీ రాఖీ పండ‌గ శుభాకాంక్షలు’’ అని లోకేశ్ తెలిపారు.
కాగా... రాఖీ పండగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఆడపడుచులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వారిలో లక్కీడ్రాలో కొంతమందిని ఎంపిక చేసి వారికి బహుమతులు ఇస్తామని తెలిపింది. ఆషామాషీ బహుమతులు కాదు, వాటి విలువ దాదాపు ఐదున్నర లక్షల రూపాయలు ఉంటుందని... ఆ స్థాయిలో బహుమతులతో తెలంగాణ ఆడబిడ్డలకు రాఖీ కానుక ఇవ్వబోతున్నట్లుగా టీఎస్ఆర్టీసీ తెలిపింది. ఈరోజు, రేపు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళా ప్రయాణికులు ఈ బహుమతులకు అర్హులు. ప్రయాణం చేసిన తర్వాత టికెట్ వెనక వారి పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ రాసి బస్టాండ్ లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్సుల్లో వాటిని వేయాలి. ఆ టికెట్లను తీసి లక్కీ డ్రా నిర్వహిస్తామని... ఆ తర్వాత విజేతలకు బహుమతులు అందిస్తామని అధికారులు తెలిపారు. మొత్తం 33మంది విజేతలను ఎంపిక చేసి వారికి ఐదున్నర లక్షల రూపాయల విలువైన బహుమతులు అందిస్తామని తెలిపారు అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు మహిళలు సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారని, వారికి అన్నదమ్ములు ఇచ్చే బహుమతులతోపాటు, ఆర్టీసీ కూడా బహుమతులు ఇస్తుందని తెలిపారు. సెప్టెంబర్-9న విజేతలను ప్రకటించి బహుమతులు అందజేస్తామన్నారు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos