విలక్షణ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు, ఆయన కుటుంబసభ్యుల మీద కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ట్రోల్స్ వస్తున్న క్రమంలో... మంచు ఫ్యామిలీ మళ్లీ వార్తల్లోకి ఎక్కేసింది. తాజాగా విద్యానికేతన్‌లో తెలుగు భాషాదినోత్సవాన్ని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేయాలని డెసిషన్ తీసుకున్నారు. దీంతో మోహన్ బాబు ఫొటోతో కలిపి తెలుగు భాషా దినోత్సవం సెలెబ్రేషన్స్ అని రాసి ఓ హోర్డింగ్ పెట్టారు. కానీ కామెడీ ఏంటంటే.. తెలుగుభాషా దినోత్సవం అని తెలుగులో కాకుండా ఇంగ్లీష్‌లో రాసి పెట్టారు. దీంతో జనాలు ట్రోల్స్ మొదలెట్టేశారు. తెలుగు భాషా దినోత్సవం అని చెప్పి.. అంతా ఇంగ్లీష్ లోనే పెట్టారు కదా... ఇదెక్కడి చోద్యం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మోహన్ బాబు కుటుంబసభ్యులపై ఇటీవల 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' - మా ఎన్నికలు, ఏపీలో సినిమా టికెట్ ధరలను ప్రభుత్వం తగ్గించడం, ఆ మధ్యన విడుదలైన 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ అడ్వాన్స్ బుకింగ్స్, కలెక్షన్స్... ఇలా ప్రతి అంశంలోనూ ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి. 'సన్ ఆఫ్ ఇండియా' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఇద్దరు హీరోలు కావాలని ట్రోల్స్ చేయిస్తున్నారని మోహన్ బాబు ఆరోపించిన సంగతి తెలిసిందే. దాంతో ఆ ఇద్దరు హీరోలు ఎవరనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో మోహన్ బాబు ... తెలుగుభాషా దినోత్సవం బోర్డును తెలుగులో కాకుండా ఆంగ్లంలో పెట్టి తాజాగా మరోసారి ట్రోలర్స్ కు దొరికిపోయారు. కాగా.. ట్రోలర్స్ పై మంచు విష్ణు తీవ్రంగా ఆక్రోశపడుతున్నారు.
కేసులు పెడతానని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే చాలా యూ ట్యూబ్ చానెల్స్ మీద కేసులు పెట్టారని సమాచారం. సినిమా ప్రమోషన్లలో తన పై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై కూడా మోహన్ బాబు మాట్లాడారు. సోషల్‌మీడియాలో వచ్చే ట్రోలింగ్స్‌ని తెలిసిన వాళ్లు తనకు పంపిస్తుంటారని... ఒక్కోసారి వాటిని చూసినప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంటుందని అన్నారు. ట్రోల్స్ అంటే నవ్వించేలా ఉండాలి కానీ, అసభ్యకరంగా ఉండకూడదని...తనను ట్రోల్ చేస్తున్న ఆ హీరోలు ఎవరో కూడా తెలుసని, వాళ్లు తాత్కాలికంగా ఆనందం పొందవచ్చు... కానీ ఏదో ఒక సమయంలో వాళ్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని మోహన్ బాబు కామెంట్స్ చేశారు. మరోవైపు... మొన్నామధ్య భక్తకన్నప్ప ప్రాజెక్ట్ గురించి మోహన్ బాబు చెప్పిన మాటలు, సినిమాను ప్రారంభించిన ఫొటోలు ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి. ఇక ఈ చిత్రం గురించి, షూటింగ్ విశేషాల గురించి విష్ణు చెప్పిన మాటల మీదా ట్రోల్స్, మీమ్స్ పడ్డాయి.
ఈ సినిమాకు ఎంత ఖర్చు అవుతుందో.. ఎలాంటి క్యాస్టింగ్ ఉంటుందో ఊహకు కూడా అందదంటూ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు ట్రోల్ చేశారు. అయితే మంచు ఫ్యామిలీ మీద ట్రోలింగ్ అనేది కొత్తేమీ కాదు. వారేం మాట్లాడినా, ఏం చేసినా కూడా కొంతమంది ట్రోల్స్ చేస్తూనే ఉంటున్నారు. మంచు ఫ్యామిలీ అంటేనే ట్రోలర్లు రెచ్చిపోతారు. దానికి మరింత మసాలా యాడ్ చేస్తారు. అందువల్ల... మంచు ఫ్యామిలీ మెంబర్స్ కూడా... ట్రోలర్ల దాడులకు సిద్ధపడిపోయారేమోనని సినీ విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos