టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర రికార్డును ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధిగమించారు. 2012లో 208 రోజుల్లో 2,817 కిలోమీటర్ల దూరం పాదయాత్రను చంద్రబాబు పూర్తి చేయగా లోకేష్ 206 రోజుల్లో 2,817 కి.మీ. లక్ష్యం చేరుకుంది. ఈ పాదయాత్ర మరో 90 రోజుల్లో 4000 కిలోమీటర్ల లక్ష్యానికి చేరుకోనుంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. జోరువానలోనూ వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు. యువనేతకు హారతులు పడుతూ మహిళలు నీరాజనాలు పలుకుతున్నారు. జోరువానలోనూ ఆగకుండా నారా లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో ఆయన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. ఈ ఏడాది జనవరిలో లోకేశ్ ... కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. 400 రోజులలో 4000 కిలోమీటర్ల లక్ష్యంతో ఈ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. వైకాపా సర్కార్ కల్పిస్తున్న అడ్డంకులను అధిగమిస్తూ.. యువజనమే దళమై.. బలమై యువగళం పాదయాత్ర దూసుకుపోతోంది. కాగా... యువగళం పాదయాత్ర టీడీపీ కోసం చేపడుతున్న ఓ రాజకీయయాత్ర మాత్రమే అనే భావన చాలామందిలో ఉంది. కానీ వైసీపీ అరాచక పాలనతో వేసారిపోయిన రాష్ట్ర ప్రజలు తమ కష్టానష్టాలు, సమస్యలు, అభిప్రాయాలు చెప్పుకొనేందుకు ఇది ఓ వేదిక అని నారా లోకేష్ చెబుతున్నారు. నిన్నగాక మొన్న భీమవరం నియోజకవర్గంలో నారా లోకేష్ వారికి చెప్పిన మాటలు ... పార్టీలకతీతంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్రంలో ప్రజలందరూ ఐకమత్యంగా... పోరాడితేనే వైసీపీని ఓడించి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించగలమని... టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎన్నడూ ఇటువంటి అరాచక పరిస్థితులు లేవని మీ అందరికీ తెలుసు కదా అని లోకేష్ పలుచోట్ల ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తూనే ఉన్నారు. పదునైన ప్రసంగాలతో ప్రజలను ఆకర్షిస్తూ... లోకేష్... తన పాదయాత్రలో తండ్రిని మించి ముందుకు దూసుకుపోతుండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos