మణిపూర్ ఘటనపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ప్రతిరోజూ దద్ధరిల్లుతున్న క్రమంలో.. కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. అన్నిపార్టీలతో మాట్లాడి చర్చకు సమయం ప్రకటిస్తామని వెల్లడించారు. ఉదయం లోక్ సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు స్పీకర్ కు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే.

మణిపూర్ అంశంపై ప్రధానితో మాట్లాడించే వ్యూహంలో భాగంగా 'ఇండియా' కూటమి తరఫున - కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. అన్నిపార్టీలతో మాట్లాడాక తేదీ నిర్ణయిస్తానని ఆయన వెల్లడించారు. ఆవిశ్వాస తీర్మాన నోటీసులను కాంగ్రెస్ కు చెందిన అస్సాం ఎంపీ గౌరవ్ గొగొయ్, బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు ఇచ్చారు. ఆ తర్వాత 50 మంది సభ్యుల మద్దతు ఉందని తేలాక ఆవిశ్వాస తీర్మానాన్ని అనుమతించారు. స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మాన నోటీసును చదివినప్పుడు కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, వామపక్షాలు, ఆప్, ఐయూఎంఎల్, శివసేన (ఉద్దవ్), ఇతర పార్టీల సభ్యులు లేచి నిల్చొని మద్దతు పలికారు. బీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, పి. రాములు, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి కూడా లేచి నిల్చున్నారు.
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవసరమైనంత సభ్యుల మద్దతు ఉందని నిర్ణయించుకున్న అనంతరం చర్చకు స్వీకరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అన్నిపక్షాల నేతలతో చర్చించిన అనంతరం నిబంధనలకు అనుగుణంగా తగిన సమయంలో చర్చ తేదీని ప్రకటిస్తానని చెప్పారు. దీంతో ఇరుపక్షాల బలాబలాలపై చర్చ జరుగుతోంది. మొత్తం 543 స్థానాలకుగాను, ఆరు ఎంపీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే... ప్రస్తుతం 537 మంది ఎంపీలు లోక్ సభలో ఉన్నారు. వాళ్లలో ఎన్డీయే పక్షానికి 331 మంది ఎంపీలు అనుకూలంగా ఉన్నారు. వీళ్లలో సొంత పార్టీ ఎంపీలు 301 మంది బీజేపీకి ఉండటం విశేషం. ఆ పార్టీకి 22 మంది వైసీపీ ఎంపీల మద్దతు కూడా ఉంటుంది.
విపక్షాలైన ఇండియా కూటమికి ప్రస్తుతం 142 మంది ఎంపీల బలం ఉంది. విపక్ష కూటమిలో లేకుండా బయట నుంచి మద్దతు ఇచ్చే పార్టీలు బీఆర్ఎస్, ఎంబీఎం. ఆ రెండు పార్టీలకు 11 మంది ఎంపీలు ఉన్నారు. ఇంకా నిర్ణయం తీసుకోని పార్టీల ఎంపీలు 31 మంది ఉన్నారు. వాళ్లందరూ ఇండియా కూటమికి మద్దతు ఇచ్చినప్పటికీ అవిశ్వాసం వీగిపోయే అవకాశం ఉంది. మ్యాజిక్ ఫిగర్ 272 మాత్రమే కావడంతో అవిశ్వాసం వీగిపోతుందని అందరికీ తెలిసిందే. కానీ, దేశంలోని పరిస్థితులపై చర్చంచడానికి అవకాశం ఉంటుందని విపక్ష కూటమి ఆలోచనగా ఉంది. అందుకే, అవిశ్వాస తీర్మానం పెట్టారని అంటున్నారు. తీర్మానం ప్రవేశపెట్టిన 10 రోజుల్లోగా దీనిపై చర్చ జరగాల్సి ఉంటుంది. వెంటనే ఇప్పటి నుంచే అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

మేము అవిశ్వాస తీర్మానాన్ని కేవలం కాంగ్రెస్ తరఫున కాకుండా ఇండియా కూటమిలో ఉన్న అన్నిపార్టీల తరఫున తీసుకొచ్చినట్లు ఆ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారీ ప్రకటించారు. ఇండియా సంఖ్యాపరంగా అవిశ్వాస తీర్మానంలో ఓటమి ఎదురైనా నైతికంగా విజయం సాధిస్తామని విపక్ష కూటమి ఇండియా అంటోంది. తీర్మానంపై సందర్భంగా మోదీ మాట్లాడతారని, కచ్చితంగా మణిపూర్ పై వివరణ ఇవ్వాల్సి వస్తుందని అభిప్రాయపడుతోంది.

మణిపూర్ పై  ప్రధాని మౌనానికి నిరసనగానే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ స్పష్టంచేశారు. ప్రజలకు ప్రధానిపై విశ్వాసం ఉందని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. ప్రతిపక్షాల అవిశ్వాసంపై ఆయన స్పందించారు. గతంలోనూ ఒకసారి ఇలాగే అవిశ్వాస తీర్మానం ఇచ్చారని, ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పా రని వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరో మంత్రి అర్జు నాం మేఘ్వాల్ తెలిపారు. కాగా.. ఈ 'అవిశ్వాసాన్ని' ప్రధాని మోదీ నాలుగేళ్లు క్రితమే ఊహించారు. ఇందుకు సంబంధించిన పాత వీడియో ఒకటి బయటి వచ్చింది.

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో.. మోదీ ఈ అవిశ్వాస తీర్మానం గురించి ప్రస్తావించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 2023 లోనూ నాపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చే అవకాశం మీకు రావాలి. అందుకు మీరు సిద్ధమవ్వాలని కోరుకుంటున్నా అని మోదీ వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు ఓటమి తప్పదని ఎద్దేవా చేస్తూ నాడు మోదీ ఇలా వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos