గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వానలు కురుస్తుండటంతో జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాలలో పరిస్థితులు దారుణంగా మారాయి. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. హిమాచల్‌ప్రదేశ్‌లోనే వరదల కారణంగా 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్‌లు కొనసాగుతున్నాయి కానీ... వరదలు  పోటెత్తుతుండటంతో ... కులూ ఏరియాలో దాదాపు 40 షాప్‌లు, 30 ఇళ్లు వరదల ధాటికి కొట్టుకుపోయాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లహౌల్, స్పితి, మనాలిలో చిక్కుకుపోయిన టూరిస్ట్‌లనూ కాపాడారు. హాస్పిటల్‌లో వారికి చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా... చంద్రతల్ ప్రాంతంలో దాదాపు 250 మంది టూరిస్ట్‌లు వరదల్లో చిక్కుకుపోయారని వార్తలు వస్తున్నాయి.

మనాలిలో 300 మంది వరదల్లో చిక్కుకున్నారు. ఇక యూపీలోనూ దాదాపు ఇవే పరిస్థితులున్నాయి. వరదల్లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు యూపీ సర్కార్ సాయం చేస్తోంది. దేశవ్యాప్తంగా... మొత్తం 18 రాష్ట్రాల్లో వరద ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటి వరకూ 8,815 ధ్వంసం కాగా... 47,225 హెక్టార్ల పంట నష్టం వాటిల్లింది.  మరోవైపు ... ఉత్తరాఖండ్‌లో వరదల ధాటికి కొండ చరియలు విరిగి పడుతున్నాయి. గంగోత్రి నేషనల్ హైవేపై కొండ చరియలు విరిగి పడటం వల్ల రోడ్  బ్లాక్ అయింది. మూడు వాహనాలు వరదల్లో కూరుకుపోయాయి. ఈ ప్రమాదంలో 5గురు యాత్రికులు చనిపోయారని.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి. హరియాణ, పంజాబ్‌లోనూ వరదలు తీవ్ర ప్రమాదకరంగా మారాయి. రెండ్రోజుల పాటు కురిసిన వర్షాలకు భారీ నష్టం వాటిల్లింది. హరియాణాలోని గగ్గర్ నది పోటెత్తుతోంది. గత కొన్నేళ్లలో ఎప్పుడూ లేనివిధంగా చెరువులు, నదులు ప్రమాదకర స్థాయిలో ముంచెత్తుతున్నాయి. ఢిల్లీలోని యమునా నది 206 మీటర్ల లెవెల్ దాటి ప్రవహిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజల్ని తరలిస్తున్నారు. ఎన్నడూ లేనంత ప్రమాదకరంగా వరదలు పోటెత్తడంతో ఉత్తరాది ప్రజలు భయం గుప్పిట్లో బతుకు వెళ్లదీస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos