ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన గౌరవార్థం.. కేంద్ర ప్రభుత్వం ముద్రించిన ఎన్టీఆర్ నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రం వేదికగా జరిగిన ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగింది. కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న జన్మించిన ఎన్టీఆర్ స్వయంకృషితో ఎదిగి సినీ, రాజకీయ రంగాలపై చెరగని ముద్రవేశారు. చిరస్థాయిగా నిలిచిపోయేలా ఆయన సమాజానికి అందించిన సేవలకు గుర్తుగా శత జయంతి సంవత్సరం సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక రూ.100 నాణేన్ని ముద్రించింది. దీనిపై మార్చి 20న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నాణెం విడుదల సందర్భంగా ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన 20 నిమిషాల నిడివి గల లఘుచిత్రాన్ని రాష్ట్రపతి ముందు ప్రదర్శించారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ వంద రూపాయిల నాణేన్ని 50శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోకచక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు. ఆయన శతజయంతి ఈ ఏడాదితో ముగిసింది. అందువల్ల 1923- 2023 అని ముద్రితమై ఉంది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ రంగాల్లో ఆయనతో కలిసి పనిచేసిన సన్నిహితులు హాజరయ్యారు. కాగా.. ఈ కార్యక్రమానికి వైసీపీ నేత, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ గా ఉన్న ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని ఆహ్వానించకుండా పక్కనబెట్టడంపై పురందేశ్వరి విమర్శలు ఎదుర్కొంటోంది. తనను ఆహ్వానించకపోవడం దారుణమంటూ లక్ష్మీపార్వతి ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మీపార్వతికి పరోక్షంగా మద్దతిస్తూ.. పురందేశ్వరిని విమరిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు ట్వీట్ పెట్టారు. ఇందులో ఎన్టీఆర్ కు ఆయన కుటుంబం ఎలా అన్యాయం చేసిందో వివరాలతో సహా ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ కు ఇంత అన్యాయం చేసి ఇప్పుడు 100 రూపాయల కాయిన్ పేరుతో పబ్లిసిటీ రాజకీయాలు చేస్తారా అంటూ పురందేశ్వరిని సాయిరెడ్డి ప్రశ్నించారు. ఇదిలావుండగా... ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమం అనంతం ... చంద్రబాబు... ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. మరోవైపు వైసీపీ కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధమైంది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos