దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్రం ముద్రించిన రూ. 100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో ఈ సార్మక నాణేం విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. భారత సినీ రంగం అభివృద్ధిలో ఎన్టీఆర్ పాత్ర కీలకమని... రాముడు, కృష్ణుడి రూపాలను ప్రజలు ఆయనలో చూసుకున్నారని, పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ నటన అద్భుతమని కొనియాడారు. రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ తన ప్రత్యేకత చాటుకున్నారని.. సామాజిక న్యాయం కోసం ఎంతగానో తపించారని అన్నారు. అంతకుముందు, ఎన్టీఆర్ కుమార్తె, ఏపీ బీజేపీ  చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఒక తరం హీరో మాత్రమే కాదని, అన్నితరాలకు ఆదర్శ హీరో అని ... సినీ, రాజకీయ రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని అన్నారు. ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేయడం ఎన్టీఆర్‌‌కు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఎన్టీఆర్ అంటే తెలియని వాళ్లు ఉండరని ... మహిళల సంక్షేమానికి ఎంతో పాటుపడ్డారని అన్నారు. తిరుపతిలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేశారని పురందేశ్వరి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాణెం విడుదలకు ముందు... ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన 20 నిమిషాల నిడివి గల వీడియో ను ప్రదర్శించారు. ఢిల్లీ వేదికగా ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగడంతో ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆనందోత్సాహాలతో పొంగిపోతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos