పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ఇక పండగే పండగ. ఆయన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించిన బ్రో చిత్రం .. ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో ఆ ఇద్దరి హీరోల అభిమానులు ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. ఈ సినిమాకు దర్శకుడు సముద్రఖని. టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా... వివేక్ కూచిబోట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు, నటుడు సముద్రఖని బిజీబిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సముద్రఖని ఏమంటారంటే... పవన్ కల్యాణ్ కి ఒక కథను వెంటనే చెప్పొచ్చునేమోగానీ, ఆయనతో వెంటనే షూటింగును చేయడం మాత్రం అంత తేలిక కాదు.. ఎందుకంటే ఒక వైపున రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్న ఆయన, తన వీలును బట్టి ఆల్రెడీ కమిటైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు.... అయినా నేను చాలావేగంగా ఆయనతో సినిమాను పూర్తిచేశానని అన్నారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే... నా మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు నేను ఏదీ ప్లాన్ చేయలేదు... 1994లో నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించా... అప్పటి నుంచి నేను ఏదీ ప్లాన్ చేయలేదు... పవన్ కల్యాణ్‌తో బ్రో చిత్రం కూడా టైమ్ డిసైడ్ చేసిందే అని సముద్రఖని చెప్పారు. తమిళంలో దర్శకుడిగా 'వినోదయా సితం' సినిమాను చేసి హిట్ కొట్టిన తరువాత... అదే కథను తెలుగులో 'బ్రో' సినిమాగా తెరకెక్కించా.. పవన్ కల్యాణ్ కు నేను 'బ్రో' కథను చెప్పగానే... కథ చాలా బాగా నచ్చిందని పవన్ చెప్పారని అన్నారు. ఎప్పటి నుంచి షూటింగు పెట్టుకుందాం అని పవన్ అడగ్గా... 'రేపటి నుంచి పెట్టుకుందాం సార్' అని చెప్పగానే ... ఒక్కసారిగా ఆయన ఆశ్చర్యపోయారని సముద్రఖని చెప్పారు. 'మిగతా విషయాలు నేను చూసుకుంటాను ... రేపు మీరు ఫలానా చోటుకి వచ్చేయండి' అన్నానని ... అలా ఆ రోజు నుంచి పవన్ ... నేను ఎప్పుడు షూటింగు పెట్టుకుంటే అప్పుడు వచ్చారని... ఆయనకి సంబంధించిన పోర్షన్ ను 21 రోజులలో పూర్తిచేశానని సముద్రఖని చెప్పారు. పవన్ కెరియర్లో చాలా తక్కువ రోజుల్లో పూర్తయిన సినిమా ఇదే. ఈ సినిమాను ఇతర భాషల్లోను రిలీజ్ చేసిన తరువాత సీక్వెల్ గురించిన ఆలోచన చేస్తానని సముద్రఖని వివరించారు. బ్రో మూవీలో సాయిధరమ్‌ పాత్ర ఆయన జీవితానికి చాలా దగ్గరైన క్యారెక్టర్. యాక్సిడెంట్ తర్వాత అతడికి చాలా దగ్గరైన క్యారెక్టర్. ఆయన పాత్రకు చిరంజీవి అని పేరు పెడుదామని అనుకొన్నాం. కానీ ఆ తర్వాత మార్కెండేయులు అని పెట్టామని సముద్రఖని చెప్పారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos