కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ కు ఇది షాక్ కలిగించే వార్తనే. విపక్షాల కూటమి గెలిస్తే ప్రధానమంత్రి అవుతారని ఆశలు పెట్టుకున్న రాహల్ గాంధీ... అసలు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతనే కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. గత లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా నమోదైన పరువు నష్టం కేసులో ఆయనకు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ గుజరాత్​ హైకోర్టులో సవాల్ చేసినా ప్రయోజనం లేకపోయింది.

 రాహుల్​గాంధీపై 10కిపైగా క్రిమినల్​ కేసులు ఉన్నాయని... ప్రస్తుతం దోషిగా తేలిన ఈ కేసు మాత్రమే కాకుండా ఆయనపై ఇంకా పలు కేసులు దాఖలయ్యాయని... మోదీ ఇంటి పేరు వివాదంలో పడిన శిక్షతో రాహుల్​ గాంధీకి అన్యాయం జరిగిందనడానికి ఏం లేదని... ఈ తీర్పు సరైనదేనంటూ.... సూరత్​ కోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని  గుజరాత్​ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ కు ఎదురుదెబ్బ తగిలినట్లేనని తెలుస్తోంది. ఏదైనా కేసులో దోషిగా తేలితే, సంబంధిత వ్యక్తి 8ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్​ గాంధీ పోటీ చేయకపోతే ఎలా.. అని పార్టీ​ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.

హైకోర్టు తీర్పుపై ఇప్పుడు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు వెళ్లడమొక్కటే మిగిలిన మార్గం. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకుని రెండేళ్ల జైలుశిక్షపై స్టే తెచ్చుకోవాల్సిందే. అలా చేస్తేనే  ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.  ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టులోనూ శిక్షపై స్టే లభించకపోతే ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అన్నిరకాల న్యాయస్థానాల్లో అవకాశాలు కోల్పోయిన తర్వాత ఆయన .. జైలుశిక్షను అనుభవించాల్సి ఉంటుంది. రెండేళ్ల పాటు జైల్లో ఉండి... విడుదలైన తర్వాత ... ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అవుతారు. ఈ పరిస్థితుల్లో రాహుల్ ... సుప్రీంకోర్టులో వేయబోయే పిటిషన్‌పై ఉత్కంఠ నెలకొంది. ఏం జరుగుతుందో మరి చూడాలి. 

 

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos