మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ లో కూడా ఆమోదం లభించింది. డిజిటల్ డివైజ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ జరిగింది. బిల్లుపై పది గంటలకు పైగా సభలో చర్చ సాగింది. అనంతరం రాత్రి జరిగిన ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 215 ఓట్లు వచ్చాయి. రాజ్యసభలో ఒక్కరు కూడా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయలేదు. ఇప్పటికే లోక్ సభ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో 456 మంది సభ్యులు ఉండగా, 454 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. రెండు ఓట్లు బిల్లుకు వ్యతిరేకంగా వచ్చాయి. ఈ రెండు ఓట్లు కూడా మజ్లిస్ పార్టీకి చెందినవి. ఎంఐఎం ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, ఇంతియాజ్ జలీల్లు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇదిలాఉండగా... ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ వర్తించనుంది. ఇక .. రాష్ట్రపతి సంతకమే తరువాయి. రాష్ట్రపతి సంతకం తరువాత బిల్లు చట్టంగా మారనుంది. బిల్లు అమలు చేసేది మాత్రం 2029 తర్వాతేనని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలు ముగిసిన వెంటనే జనగణన, డీలిమిటేషన్ చేపడతామని, వీలైనంత త్వరగా చట్టాన్ని అమలు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos