క్రికెటర్లకు .. మ్యాచ్ లు ఆడే అవకాశాలు... కేవలం వారి ప్రతిభపైనే కాకుండా... దైవాధీనం పైన కూడా ఆధారపడి ఉంటుందనే వ్యాఖ్యలు పలువురు క్రికెట్ అభిమానుల నుంచి వస్తున్నాయి. వెస్టిండీస్ లో జులై 12 నుంచి జరిగే మ్యాచ్ లో పుజారా కు ఆడే అవకాశం ఇవ్వడం లేదని... దీనిపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా అసంతృప్తి చెందారని ఇటీవలే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇదే కోవలో ముంబయి క్రికెటర్ సర్పరాజ్ ఖాన్ పేరు కూడా వినిపిస్తోంది. సర్పరాజ్ ... వెస్టిండీస్ టూర్ కు ఎంపిక కాలేదు.
ఇందుకు సంబంధించి బీసీసీఐ పై పలువురు క్రికెట్ అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అతన్ని బీసీసీఐ పక్కన పెట్టేసి... తుది జట్టులోకి అతనికి అవకాశం ఇవ్వలేదనే మాటలు వినిపిస్తున్నాయి. టీమిండియా జట్టు వెస్టిండీస్ లో జులై 12 నుంచి ఆగస్టు 13 వరకు పర్యటించనుంది. ఈ టూర్ లో భారత జట్టు రెండు టెస్టులు.. మూడు వన్డేలు.. ఐదు టీ20 మ్యాచ్ లను ఆడనుంది. దీనికి ప్రకటించిన తుదిజట్టులో సర్పరాజ్ కు స్థానం లభించలేదు. దేశవాళీ క్రికెట్ లో రాణిస్తున్న సర్పరాజ్ ను కాదని ఐపీఎల్ రాణించిన రుతురాజ్ గైక్వాడ్ ... యశస్వి జైశ్వాల్ ను ఎంపిక చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్పరాజ్ ... బ్యాటర్ గా మంచి సత్తా చాటి ... తన ప్రతిభను నిరూపించుకున్న సందర్భాలు ఉన్నాయి. ముంబయికి ప్రాతినిధ్యం వహించే సర్పరాజ్ చివరి మూడు రంజీ సీజన్లలో పరుగుల వరద పారించాడు.
ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 80 శాతం సగటుతో పరుగులు చేశాడు. ఒక మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ పరుగులు చేయటంతోపాటు చివరి మూడు రంజీల్లో 2566 పరుగులు చేయటం ద్వారా తన సత్తా చాటాడు. అయినప్పటికీ అతడికి టీమిండియా జట్టులో చోటు ఎందుకు దక్కలేదన్నది ప్రశ్నగా మారింది. కాగా... సర్పరాజ్ ఫిట్ నెస్ లెవెల్స్ అంతర్జాతీయ క్రికెట్ కు తగ్గట్టుగా లేవని బీసీసీఐ... ఒక స్థిర అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అతడ్ని సెలెక్టు చేయకపోవటానికి అది కూడా ఒక కారణమనే వార్త వినిపిస్తోంది.
అతను తన ఫిట్ నెట్ ను మెరుగుపర్చుకొని.. బరువు తగ్గాలని.. టీమిండియా ఎంపికకు ఒక్క బ్యాటర్ గా రాణించటమే సరిపోదని.. ఆటగాడి ఫిట్ నెట్ ను సైతం పరిగణలోకి తీసుకుంటారని బీసీసీఐ అభిప్రాయ పడినట్లు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మైదానం లోపల.. బయట అతని ప్రవర్తన గొప్పగా లేదని... మ్యాచ్ ల సందర్భంగా అతను ప్రదర్శించే ఎమోషన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని... మరింత క్రమశిక్షణ అవసరమనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా బ్యాట్ తో మెరుపులు మెరిపిస్తున్న సర్పరాజ్.. అతనిలోని లోపాల్ని సరిదిద్దుకుంటే.... తిరిగి జట్టులోకి రావటానికి అవకాశం ఉంటుందేమో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos