బిగ్ బాస్ సీజన్ 7 లో మూడో రోజు రచ్చ రచ్చ జరిగినట్లు తాజా ప్రొమోలో కనిపిస్తోంది. నిర్వాహకులు రిలీజ్ చేసిన ప్రొమోలో కాఫీ కోసం హీరో శివాజీ రచ్చ చేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ పై కేకలు వేస్తూ హంగామా చేయడంతో పాటు కోపంతో అరవడం వీడియోలో చూడొచ్చు. కాఫీ కోసం గోల చేస్తున్న శివాజీతో బిగ్ బాస్ కాసేపు ఆడుకున్నాడు. హౌస్ లోకి బీపీ మిషన్ పంపించి శివాజీ బీపీ చెక్ చేయాలని మిగతా సభ్యులకు సూచించాడు. దీనిపై శివాజీ మండిపడ్డాడు. తాను ఓవైపు ఇబ్బంది పడుతుంటే జోకు లేస్తావా? అంటూ బిగ్ బాస్ పై అరిచాడు. తన సమస్యను చూపించి మిగతా సభ్యులకు వినోదం పంచాలని అనుకుంటున్నావా? అంటూ బిగ్ బాస్ ను నిలదీశాడు. తనకు హౌస్ లో ఉండడం ఇష్టం లేదని, కనీస అవసరాలు తీర్చని ఈ హౌస్ లో తాను ఉండనని స్పష్టం చేశాడు. తలుపు తీస్తే తాను బయటకు వెళ్లిపోతానని చెప్పాడు. కాగా... బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడే నామినేషన్ల పర్వం మొదలైంది. లోపల ఉన్న కంటెస్టెంట్లలో 14 మందిలో 8 మంది ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. దామిని, శివాజీ, శోభా శెట్టి, గౌతమ్, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, రతిక, షకీలాలలో ఒకరు ఈ వారంలోనే బయటకు రానున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులు రిలీజ్ చేసిన ప్రొమోలో ఇంకా ఏముందంటే.. రతిక పాటలు పాడుతుంటే బిగ్ బాస్ వారించాడు. మీరు బిగ్ బాస్ కి కాకుండా సింగింగ్ షోకి వచ్చినట్టు అనిపిస్తుందా... అంటూ చురక వేశాడు. కాఫీ పొడి పంపించేదాకా ఇలానే పాటలు పాడుతూ ఉంటానని రతిక ... బిగ్ బాస్ కు తేల్చి చెప్పేసింది. టేస్టీ తేజ తన మైక్ కాకుండా వేరే వాళ్ళ మైక్ వేసుకుని తిరుగుతున్నాడని బిగ్ బాస్ గాలి తీసేస్తాడు. ఈసారి ముందుగా చెప్పినట్టు ఉల్టా పుల్టా అంటూ బిగ్ బాస్ ఇంట్లో ఫర్నిచర్, సరుకులు ఏమి లేకుండానే కంటెస్టెంట్స్ ని పంపించారు. వచ్చిన మొదటి రోజు నుంచి శివాజీ కాఫీ కోసం అల్లాడిపోతున్నాడు. నాలుగో రోజు శివాజీ సహనం నశించి చిరాకుగా కిచెన్ లోకి వెళ్ళి కాఫీ పంపించవయ్యా అంటూ బిగ్ బాస్ మీద అరిచాడు. కాఫీ లగ్జరీ బడ్జెట్ కదా అని షకీలా అంటోంది. శివాజీ ఇంట్లో ఉన్న వస్తువులు విసిరేస్తూ ఇంకొక గంట చూస్తాను... బిగ్ బాస్  కు కూడా భయపడను అని సీరియస్ అయిపోయాడు. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో మూడో రోజు శివాజీ రచ్చ రచ్చ చేయడం హాట్ టాపిక్ అయింది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos