ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు ఇప్పుడిప్పుడే ఆగేలా కనిపించడం లేదు. కృష్ణా, గోదావరి నదీజలాల వినియోగం విషయంలో ఫిర్యాదులు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా కృష్ణా ట్రిబ్యునల్ లో తెలంగాణ ప్రభుత్వం పై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఒక పిటిషన్ విచారణ జరగ్గా ఏపీ ప్రభుత్వానికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.
తెలంగాణలోని పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పై ఏపీ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ లో దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ ను కృష్ణా ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. గత సంవత్సరం డిసెంబర్ లో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల నికర జలాలను కేటాయిస్తూ తెలంగాణ రాష్ట్రం ఉత్తర్వులు జారీ చేసిన అంశంపై ఏపీ ప్రభుత్వం ... ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేస్తూ... తెలంగాణ 90 టీఎంసీల నీటిని వాడకుండా ఆపాలని అందులో పేర్కొంది. అంతేకాకుండా ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ ను దాఖలు చేసింది.
ఇదే సమయంలో...ఈ అప్లికేషన్ ను విచారించే అధికారం తమకు లేదని, ఇందుకు తగిన వేదికలను ఆశ్రయించాలని కృష్ణా ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఈ అంశం తమ పరిధిలో లేదని, సరైన ఫోరంలో తేల్చుకోవాలని చెబుతూ ట్రిబ్యునల్ ... ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసును కొట్టివేయడంతో ప్రభుత్వం ఇతర మార్గాలను అన్వేషిస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos