బీఆర్ఎస్ కు చెందిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ , ఆ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ... ఈ తీర్పువల్ల  పార్టీకి ఇబ్బందికర పరిణామాలు ఏర్పడుతాయా అనే కోణంలో కేసీఆర్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సంగతలా ఉంచితే... ఈ తీర్పు విషయం గురించి కాస్త పరిశీలిద్దాం. అసలేం జరిగిందంటే... 2018 అసెంబ్లీ ఎన్నికల

సమయంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తప్పుడు అఫిడవిట్ సమర్పించారనే అభియోగాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో నేర నిరూపణ కావడంతో ఆయనపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయడమే కాకుండా... రూ. 5 లక్షల జారిమానా కూడా విధించింది.  అంతేకాకుండా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గంలో రెండోస్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును 2018 డిసెంబర్ 12 నుంచి ఎమ్మెల్యేగా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయన కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన జలగం వెంకట్రావు రెండోస్థానంలో నిలిచారు. వనమాకు దాదాపు 81 వేల ఓట్లు రాగా, జలగం వెంగట్రావుకు దాదాపు 77 వేల ఓట్లు  వచ్చాయి. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో వనమా బీఆర్ఎస్ లో చేరారు. ఇదిలాఉంటే... వనమా వెంకటేశ్వరావు ఎన్నికను జలగం వెంకట్రావు సవాలు చేస్తూ 2019లోనే కోర్టును ఆశ్రయించి... ఎన్నికల అఫిడవిట్‌లో వనమా తప్పుడు సమాచారం ఇచ్చారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఇదిలావుండగా... ఆమధ్యకాలంలో వనమా కుమారుడి వ్యవహార శైలి కారణంగా ఆయన కుటుంబంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం గురించి ఈ సందర్భంగా స్థానికంగా తీవ్రంగా చర్చించుకుంటున్నారు. కొద్దినెలల క్రితం వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ ఓ కుటుంబాన్ని వేధించిన వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. మీ-సేవ నిర్వాహకుడిగా ఉన్న వ్యక్తికి ఆయన సోదరి, తల్లితో ఉన్న ఆస్తి గొడవలు సెటిల్ చేయడానికి గాను... ఆయన భార్యను తన వద్దకు పంపమని రాఘవ కోరాడనే మాట అప్పట్లో బయటికి వచ్చింది. సదరు బాధితుడు ఈ విషయాన్ని స్వయంగా వీడియో రికార్డు చేసి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో పరారీలో ఉన్న రాఘవను పోలీసులు గాలించి అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత వనమా రాఘవకు హైకోర్టు ... షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కొత్తగూడెం నియోజకవర్గంలో అడుగు పెట్టవద్దని, ప్రతీ శనివారం ఖమ్మం పోలీస్ స్టేషన్‌లో సంతకం చేయాలని ఆదేశించింది. సాక్షులను మభ్య పెట్టడం, తారుమారు చేయడం వంటి పనులకు పాల్పడితే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించింది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వనమా రాఘవ కొత్తగూడెం అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో అసాంఘిక శక్తిగా చెలరేగిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారం మొత్తాన్ని కొడుకు చేతిలో పెట్టడంతో వనమా వెంకటేశ్వరావు అప్రతిష్ట పాలయ్యారు. చివరకు హైకోర్టు ఆదేశాలతో పదవిని కూడా కోల్పోయారు. పదవి, అధికారం ఉందని విర్రవీగితే... ఇలాంటి పరిణామాలే ఎదుర్కోకతప్పదని సామాన్య ప్రజానీకం విమర్శిస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos