తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి అధికార పార్టీకి షాకిచ్చారు. కొన్నిరోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారిద్దరి పేర్లను ప్రతిపాదిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఈ పేర్ల ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించింది.
ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తిరస్కరించారు. గవర్నర్ కోటాలో ఎంపిక చేయడానికి అర్హతలు అడ్డు వస్తున్నాయంటూ.. ఎంపిక ప్రక్రియను పక్కన పెట్టారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ లను ఎంపిక చేసేందుకు వారికి సరైన అర్హతలు లేవన్నారు. ఆర్టికల్ 17 (5) ప్రకారం దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఎంపిక జరగలేదని.. వీళ్లిద్దరూ ఎక్కడా సామాజిక సేవా కార్యక్రమాలు, సేవా విభాగాల్లో పాల్గొన్నట్లు కనిపించలేదని గవర్నర్.. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రత్యేక లేఖ ద్వారా తెలియజేశారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులకు వారిద్దరిని నామినేట్ చేస్తూ ఈ ఏడాది జులై 31న జరిగిన కేబినెట్ సమావేశం తీర్మానం చేయడంతో.. ఈ సిఫారసులపై గవర్నర్ అధ్యయనం చేసి చివరకు తిరస్కరించారు. రాష్ట్రంలో ఎందరో అర్హులున్నారని ... అర్హులైన వారి పేర్లను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేస్తే ఆమోదం తెలుపుతామని తమిళిసై పేర్కొన్నారు. దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల అభ్యర్థిత్వాలను ఏ ఏ కారణాలతో రిజెక్ట్ చేయాల్సివచ్చిందో వేర్వేరు లేఖల్లో వివరించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ లేఖలు పంపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos