సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు మరోసారి తెరపైకి వచ్చింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి కృషి చేయాలంటూ అన్నిపార్టీల ముఖ్య నేతలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఈ సమావేశాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సహా మొత్తం 47 రాజకీయ పార్టీల అధినేతలకు ఈ లేఖను పంపించారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి మహిళా బిల్లు విషయంలో ఐకమత్యంగా వ్యవహరించాలని కోరారు. మహిళా బిల్లు చారిత్రక అవసరమనీ, చట్టసభల్లో సరిపడా మహిళల ప్రాతినిధ్యం ఉంటేనే దేశం పురోగమిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదే విష‌యాన్నిఆ లేఖలో ప్రస్తావించారు. చారిత్రక ముందడుగు వేయడానికి ప్రజాప్రతినిధులకు ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఒక మంచి అవకాశ‌మ‌ని, రాజకీయాలకు అతీతంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఏకమై అన్నిపార్టీలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచడం చాలా ముఖ్యమని... దేశ జనాభాలో 50 శాతం వరకు మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నా చట్టసభల్లో మాత్రం మహిళలకు ఓటు లభించడం లేదని అన్నారు. అందుకే అందరం కలిసి మహిళా బిల్లు కోసం పట్టుబట్టాలని... అన్నిపార్టీలు కలిసి వస్తేనే.. కేంద్రం దిగివస్తుందని అన్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లుపై అందరు కలసి కట్టుగా ఒత్తిడి పెంచాలని కోరారు. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని కోరారు. బీజేపీ అధినేత జేపీ నడ్డా, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, డీఎంకే బాస్ ఎంకే స్టాలిన్, ఎన్సీపీ శరద్ పవార్, కాంగ్రెస్‌ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా రాజకీయ పార్టీల అధ్యక్షులకు కవిత ప్రత్యేక లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వెనుక ఉన్న బాధ్యతను గుర్తుంచుకోవాలని ఎమ్మెల్సీ కవిత తన లేఖలో అభ్యర్థించారు. ఇండియా కూటమికి కూడా ఈ మేరకు కవిత అభ్యర్థన పంపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos