సీనియర్ ఎన్టీ రామారావు కుమారుడు హరికృష్ణ 2018 సంవత్సరంలో ఇదే రోజు ఆగస్టు 29 న రోడ్డుప్రమాదంలో మృతిచెందిన సంఘటన జరగడంతో కుటుంబసభ్యులందరూ విషాదంలో మునిగిఉన్నారు. ఇదే సమయంలో... సీనియర్ ఎన్టీఆర్ మనవడు తారకరత్న ఫ్యామిలిలో నేడు స్పెషల్ డే. తారకరత్న – అలేఖ్యరెడ్డి జంటకు ఇద్దరు కవలల పుట్టిన రోజు ఇదే రోజు కావడం గమనార్హం. ఈ సందర్భంగా నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్యరెడ్డి ... తన భర్తను తలచుకుని ఎమోషనల్ అయ్యారు. నందమూరి తారక రత్న ఈ ఏడాది ఫిబ్రవరి 22న గుండె సంబంధిత సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే తారకరత్న ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉండేవారు. కానీ కలలో కూడా ఊహించని విధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర సమయంలో తారకరత్న కుప్పకూలడం.. ఆసుపత్రిలో కొన్నిరోజుల చికిత్స తర్వాత మరణించడం చకచకా జరిగిపోయాయి. తాజాగా అలేఖ్య రెడ్డి తారకరత్నని గుర్తు చేసుకుంటూ కుమిలిపోయారు. తారకరత్న కవల పిల్లలు తన్యరామ్, రేయ ఇద్దరి పుట్టినరోజు. దీంతో అలేఖ్య రెడ్డి.. తన్యరామ్, రేయి లతో తారకరత్నకి ఉన్న మధురమైన అనుభూతులకు సంబంధించిన దృశ్యాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సంతోషకర సమయంలో.. ఎంత ప్రయత్నించినా తన్యరామ్, రేయ లకు ఆనందంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేకున్నానంటూ అలేఖ్యరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి సమయంలో మీరు లేకపోవడం భరించలేకుండా ఉన్నానని... కానీ పిల్లల ముఖాల్లో మీరు ఎప్పుడూ ఉంటారని పోస్ట్ చేశారు. పిల్లల పుట్టినరోజున మీరు లేకపోకవడం వల్ల సంతోషంగా ఉండలేకున్నానని సోషల్ మీడియా ద్వారా అలేఖ్య తన బాధని బయట పెట్టారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తారకరత్న, అలేఖ్య దంపతులకు మొదట కుమార్తె నిష్క జన్మించింది. ఆ తర్వాత కొడుకు తనయ్ రామ్, కుమార్తె రేయ కవలలుగా జన్మించారు. తన తాతగారు ఎన్టీఆర్ లోని మూడు అక్షరాలు కలిసేలా నిష్క, తనయ్, రేయ అని తారకరత్న పిల్లలకు నామకరణం చేశాడు. ఇటీవల అలేఖ్య తన కొడుకు తన్యరామ్ అచ్చం తండ్రిలాగే ఉన్నాడంటూ పోస్ట్ చేసిన ఓ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.  తారకరత్న భద్రాద్రి రాముడు చిత్రంలోని లుక్ ని తన కొడుకు తనయ్ రామ్ తో పోల్చుతూ అలేఖ్య పోస్ట్ పెట్టారు.ఈ ఫోటో కి అలేఖ్య లైక్ ఫాదర్ లైక్ సన్ అని కామెంట్ పెట్టింది. ఈ ఫోటోని షేర్ చేస్తూ నందమూరి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితిని తలచుకుని తారకరత్న అభిమానులు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos