అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ కమిషనర్ వ్యవహార శైలిని నిరసిస్తూ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. కమిషనర్ నిర్లక్ష్య వైఖరి నశించాలని, కమిషన్ వెంటనే సమాధానం చెప్పాలనే నినాదాలతో హోరెత్తించారు. మున్సిపల్ కమిషనర్ ప్రొటోకాల్ పాటించాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించిన కొంతమంది కాంట్రాక్టర్‌లు పలు భవనాలను అసంపూర్తిగా నిర్మించి నిబంధనలకు విరుద్ధంగా ప్రారంభించారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలోని మున్సిపల్‌ కమిషనర్‌ ఛాంబర్‌ ముందు ఐదోరోజు నిరసనకు దిగారు. అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభం కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించలేదని... కమీషనర్ వచ్చి సమాధానం చెప్పేంత వరకు నిరసన కొనసాగిస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి మొండికేశారు. రాత్రి కమీషనర్ చాంబర్ ముందే నిద్రించి ఉదయం మున్సిపల్ కార్యాలయంలోనే బ్రష్ వేసి స్నానం చేశారు. మున్సిపల్ కార్యాలయానికి రాకుండా ఎమ్మెల్యే కార్యక్రమంలో కమీషనర్ ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు జేసీ. కాగా.. టీడీపీ కౌన్సిలర్ల ధర్నా నేపథ్యంలో కమిషనర్ అక్కడే నిల్చుండిపోయారు. ఈ సమయంలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన కుమారుడు హర్షవర్ధన్ రెడ్డితో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. హర్షవర్ధన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ను ఆయన చాంబర్ లోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు అధికారులు అక్కడ స్పెషల్ పార్టీ పోలీసులను మోహరించారు. మున్సిపల్ కార్యాలయం వద్దే బైఠాయించిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... నా తండ్రి హయాం నుంచి చూస్తే ... తాడిపత్రికి మా కుటుంబానికి 120 ఏళ్ల అనుబంధం ఉందని తెలిపారు. తాడిపత్రి మాకు ఇల్లు వంటిదని ...  ఒకప్పుడు తాడిపత్రి నెంబర్ వన్ మున్సిపాలిటీ అని అన్నారు. అలాంటి మున్సిపాలిటీని సర్వనాశనం చేశారని విమర్శించారు. పరిస్థితులు ఇలా క్షీణిస్తుంటే చూస్తూ ఉండగలమా...  ఇవాళ మేం పోరాడుతున్నది మా కోసం కాదని అన్నారు. కాగా... నేతల నిరసన కార్యక్రమాలతో విధులకు ఆటంకం కలుగుతోందని మున్సిపల్‌ కమిషనర్‌ రవి స్థానిక డీఎస్పీని కలిసి వివరించినట్లు తెలుస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో గతంలో కూడా ఇదేవిధంగా నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఎంతదాకా వెళుతుందో చూడాలి మరి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos