ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అన్నివర్గాల్లోనూ గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా ఐఏఎస్ అధికారుల నుంచి వివిధ స్థాయిల అధికారుల్లో కొత్త ఆందోళన స్టార్ట్ అయింది. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రభుత్వ శాఖల కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు హడావుడి చేస్తుండటంతో వారు హైరానా పడుతున్నారు. అమరావతి రాజధాని ఆశలను మొగ్గలోనే తుంచేసి... మూడు రాజధానుల కాన్సెప్ట్ ను వెలికి తీసిన సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేసి ... పరిపాలన అక్కడి నుంచే నడిపించాలన్న వైఖరితోనే మొండిగా ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో ... డిసెంబర్ 8 నుంచి విశాఖ కేంద్రంగా పాలన సాగించాలనే నిర్ణయానికి రావడంతో ప్రభుత్వ శాఖల కార్యాలయాలను అక్కడికి తరలించేందుకు వైసీపీ సర్కార్ హడావుడి చేస్తోంది. దీంతో అధికారులు కీలక సందేహాలు లేవనెత్తుతున్నారు. శాఖలన్నీ తరలిపోవడం ఖాయమేనా... అమరావతి నుంచి విశాఖకు మకాం మార్చేందుకు శాఖాధిపతులు సిద్ధమేనా... ప్రభుత్వం ప్లేస్ ఆఫ్ వర్క్‌ నోటిఫై చేయకుండా శాఖలను తరలించడం సాధ్యమేనా అంటూ కొందరు ఐఏఎస్ అధికారులను సందేహాలు తొలుస్తున్నాయి. దీంతో వారు నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డినే గట్టిగా ప్రశ్నించారని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి, ప్రభుత్వ శాఖలకు, ఉన్నతాధికారులకు, ఉద్యోగులు, సిబ్బందికి ప్లేస్ ఆఫ్ వర్క్ అనేది కీలకమైన అంశంగా ఉంటుందని, దీన్ని ఎలా పడితే అలా వినియోగించుకోడానికి నిబంధనలు అంగీకరించవని అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రభుత్వం ప్లేస్‌ ఆఫ్‌ వర్క్‌ను నోటిఫై చేయకుండా ప్రభుత్వ శాఖలను తరలించేస్తే తాము అక్కడికి రాబోమని కొందరు ఐఏఎస్లు సీఎస్కు తేల్చి చెప్పినట్లు సమాచారం. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ లాంటి సీనియర్ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ ... విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు నివేదిక ఇవ్వటమే తప్పని ఐఏఎస్ అధికారులు భావిస్తున్నారు. ఇది నేరుగా సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘించటంతో పాటు ప్రభుత్వ బిజినెస్ రూల్స్‌కు విరుద్ధమని అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ప్రకారం ఐఏఎస్ అధికారులు అధికారిక పనుల నిమిత్తం ఢిల్లీకో, పొరుగు రాష్ట్రాలకో, విదేశాలకో వెళ్లాలన్నా... ఆ అధికారి పర్యటనకు సంబంధించిన ఉత్తర్వులు ప్రత్యేకంగా జారీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశిస్తే ఆయా తేదీల్లో మాత్రమే తాము వస్తామని, పూర్తిగా అక్కడికి తరలివచ్చేందుకు సాధ్యం కాదని ఐఏఎస్లు చెప్పినట్లు సమాచారం. మరోవైపు విశాఖలోని విమ్స్‌లో అధికారులకు క్యాంపు కార్యాలయాలు, విడిది ఏర్పాటుకు వీలుందంటూ కమిటీ నివేదిక ఇవ్వడం, ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపైనా అభ్యంతరం వ్యక్తం అవుతోంది. జాతీయ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారం విమ్స్ ప్రాంగణాన్ని ఇతర అవసరాలకు వినియోగించేందుకు ఆస్కారం లేదని తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos