తెలుగు రాష్ట్రాలను వర్షాలు ఇప్పుడిప్పుడే వదిలేలా కనిపించడం లేదు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు వాతావరణ శాఖ మరోమారు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అంచనా వేసింది. నగరంలోని చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్ తో పాటు మొత్తం ఆరు జోన్లలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం బంగ్లాదేశ్ తీరంలో కేంద్రీకృతమై ఉందని ... ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతోందని వివరించింది. దీని ప్రభావం వల్ల ఈ నెల 6వ తేదీ వరకు వాయువ్య భరతంలో వానలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మహారాష్ట్ర, కొంకణ్ తీరంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్, జార్ఘండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా మరో 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. వ్యవసాయదారులు, గ్రామీణులు, వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.తెలుగు రాష్ట్రాలను వర్షాలు ఇప్పుడిప్పుడే వదిలేలా కనిపించడం లేదు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు వాతావరణ శాఖ మరోమారు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అంచనా వేసింది. నగరంలోని చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్ తో పాటు మొత్తం ఆరు జోన్లలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం బంగ్లాదేశ్ తీరంలో కేంద్రీకృతమై ఉందని ... ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతోందని వివరించింది. దీని ప్రభావం వల్ల ఈ నెల 6వ తేదీ వరకు వాయువ్య భరతంలో వానలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మహారాష్ట్ర, కొంకణ్ తీరంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్, జార్ఘండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా మరో 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. వ్యవసాయదారులు, గ్రామీణులు, వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos