లోక్ సభలో అధికార, ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై సభాపతి ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో మంగళవారం బిల్లులకు ఆమోదం తెలిపే సమయంలో ఎడతెగకుండా సభా కార్యకలాపాలకు అంతరాయం కల్పిస్తుండటాన్ని తప్పుబట్టారు. సభా గౌరవానికి అనుగుణంగా సభ్యులు ప్రవర్తించే వరకు తాను సభకు హాజరుకాబోనని హెచ్చరించారు. ఈ హెచ్చరికకు అనుగుణంగానే ఆయన బుధవారం సభాధ్యక్ష స్థానంలో కనిపించలేదు. మణిపూర్ సమస్యపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పార్లమెంటులో ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో లోక్ సభ గురువారానికి వాయిదా పడింది. లోక్ సభ కార్యకలాపాలను బుధవారం బీజేపీ ఎంపీ కిరీట్ సోలంకి నిర్వహించారు. సభ్యులు శాంతియుతంగా వ్యవహరించాలని కిరీట్ కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయన సభను వాయిదా వేశారు. ఇదిలావుండగా... ఢిల్లీ ప్రాంత ప్రభుత్వ సవరణ బిల్లును బుధవారం లోక్ సభ పరిశీలించి, ఆమోదించవలసి ఉంది. కానీ సభ వాయిదా పడటంతో అది సాధ్యం కాలేదు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గత నెల 20న ప్రారంభమైనప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష సభ్యులు పదే పదే అంతరాయం కలిగించడంపై స్పీకర్ ఓం బిర్లా అసంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని అధికార, ప్రతిపక్ష సభ్యులకు అధికారులు తెలిపారు. మణిపూర్ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు ... కేంద్రప్రభుత్వంపై లోక్ సభలో ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ఈ నెల 8 నుంచి ప్రారంభమవుతుంది. 10వ తేదీన మోదీ సమాధానం చెబుతారు. ఈలోగా సభలో ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos