కేంద్ర ప్రభుత్వం భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిలకు పద్మ విభూషణ్ పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరిపై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా...,ఈ పద్మ విభూషణుల ఇద్దరి మధ్య ఆత్మీయ కలయిక చోటుచేసుకుంది. వెంకయ్యనాయుడుని హైదరాబాద్‌​లోని ఆయన నివాసంలో మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.  ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. వెంకయ్యనాయుడికి ... చిరంజీవి శాలువా కప్పి గౌరవించారు. అనంతరం, వెంకయ్యనాయుడు కూడా చిరంజీవికి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఆయన మెడలో ఉత్తరీయం వేసి సన్మానించారు. చిరంజీవికి  కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇలా ఒకరినొకరు అభినందించుకోవడం, పరస్పర ప్రశంసలతో ముంచెత్తుకోవడం ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి ఎక్స్ లో పంచుకున్నారు. 'జై ఆంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో నేను కాలేజీలో చదువుతున్నా. ఆ సమయంలో వెంకయ్యనాయుడు విద్యార్థి ఉద్యమనేత. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేము కాలేజీలు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్నాం. నాకు ఆయన ఆ రోజు నుంచి తెలుసు' అని చిరంజీవి తన కాలేజీ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా... చిరంజీవికి కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో మోహన్ బాబు స్పందించారు. చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. "నా ప్రియ మిత్రుడు చిరంజీవికి అభినందనలు. ఈ పురస్కారానికి చిరంజీవి అన్ని విధాలా అర్హుడు. నువ్వు ఈ అవార్డు అందుకోబోతున్నందుకు మేమంతా ఎంతో గర్విస్తున్నాం" అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos