టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అక్రమకేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన సతీమణి నారా భువనేశ్వరి విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు దీక్షలు కొనసాగుతున్న క్రమంలో తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరంలో చేపట్టిన నిరసన దీక్షలో భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... చంద్రబాబు రూ.371 కోట్లు దారి మళ్లించారని చెబుతున్నారని, కానీ అ డబ్బులు అసలు ఎక్కడికి వెళ్లాయో నిరూపించడం లేదన్నారు. ఏ కేసులో అయినా ఆధారం చూపి అరెస్టు చేస్తారని... కానీ స్కిల్ కేసులో ఆధారాలు లేకుండా అరెస్టు చేసి... ఇప్పుడు డబ్బులు ఎక్కడి వెళ్లాయని విచారిస్తున్నారని అన్నారు. ఇలాంటి విచిత్రాన్ని ఎవ్వరూ ఎప్పుడూ చూసి ఉండరని అన్నారు. నేను కూడా ఒక స్త్రీనే నని... నాపైనా రకరకాల మాటలతో దాడి చేశారని... అయినా భయపడలేదని భువనేశ్వరి అన్నారు. పనిలేని వాళ్లు ఏమైనా అంటారు. అలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అన్నివర్గాల వారు వచ్చి చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారని... మీ పోరాటానన్ని మేము మర్చిపోలేమని అన్నారు. యువత భవిష్యత్తు కోసం నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించగా... లోకేష్ ను మాట్లాడనివ్వకుండా ఈ ప్రభుత్వం మైక్ లు, సౌండ్ వాహనాలు, నిలబడేందుకు తెచ్చుకున్న కుర్చీ కూడా ఎత్తుకెళ్లిందని అన్నారు. అయినా లోకేష్ ఎంతో ధైర్యంతో యాత్ర కొనసాగించారని ... ఎన్ని అడ్డుంకులు సృష్టించినా యువగళం పాదయాత్ర ఆగదని అన్నారు. మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి 70 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంటే ... ఆమెపై కూడా హత్యాయత్నం కేసు పెట్టారని అన్నారు. ఈ కేసులో ఏమైనా అర్థం ఉందా... ఆమె హత్య చేస్తారా...  అని భువనేశ్వరి ప్రశ్నించారు. పోలీసులకు వారి విధులు తెలియవా.. ప్రభుత్వం ఏది చెబితే అది చేస్తున్నారని విమర్శించారు.  రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించాలని... భయపడకుండా అందరూ ముందుకొచ్చి ఓటేయాలని... ధైర్యంతో మీరంతా ముందుకు సాగితే ప్రభుత్వం ఏమీ చేయలేదని ప్రజలకు పిలుపునిచ్చారు. సేవ్ ఆంధ్రప్రదేశ్... సేవ్ డెమొక్రసీ.. సత్యమేవ జయతే’’ అని భువనేశ్వరి నినదించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos