నేడు తెలుగుభాషా దినోత్సవం. దేశంలో 22 అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో ఒకటిగా వెలుగొందుతున్న తెలుగు భాషకు మూలం ద్రావిడ భాష. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష చట్టం ద్వారా 1966 లో తెలుగు ను రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం లోను తెలుగును అధికారిక భాషగా గుర్తించారు. ఇక 2008 లో కన్నడ తో పాటు తెలుగును ప్రాచీన భాష గా గుర్తించారు. హిందీ, బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడుకునే భాష తెలుగు. మనం ప్రతి యేటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకొంటాం. తెలుగు కవి గిడుగు వేంకట రామమూర్తి జయంతి కూడా ఈ రోజే. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను గౌరవించటానికి.. ఆయన జయంతి నాడు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.  ఈ ఏడాది గిడుగు వేంకట రామమూర్తి 160వ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. తెలుగు భాష కనుమరుగైపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉందని పలువురు భాషాపండితులు ఈ సందర్భంగా అన్నారు. కాగా... తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. గిడుగు వేంకట రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న వేళ... ప్రపంచ వ్యాప్త తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వ్యవహారిక భాషలోనే పుస్తక రచన చేయాలని ఉద్యమించి, సాహిత్యాన్ని సామాన్యుడికి చేరువచేసిన గిడుగు రామమూర్తి స్మృతికి నివాళులర్పిస్తున్నానన్నారు. విద్యావ్యాప్తి జరగాలంటే బోధన మాతృభాషలోనే ఉండాలని ఆయన ఆశించారు. గిడుగు వారి ఆశయ స్ఫూర్తిగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం దగ్గర నుంచి పాలనలో తెలుగును ప్రవేశపెట్టడం వరకు ... టీడీపీనే నడుం కట్టిందని అన్నారు. తెలుగు భాషను కాపాడుకునేందుకు అందరం కలిసికట్టుగా పాటుపడాలని కోరుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా... మనం కూడా... తెలుగు కవులకు, సాహితీవేత్తలకు, తెలుగు బోధించే ఉపాధ్యాయులకు, తెలుగు మాతృభాష అయిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజానీకానికి తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు చెబుదామా మరి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos