ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై నమోదైన కేసుల్లో న్యాయపరంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పైన హైకోర్టులో శుక్రవారం విచారణ ప్రారంభమైంది. ఈ బెయిల్ పిటిషన్ పైన ఈ నెల 27న వాదనలు జరగగా, తదుపరి విచారణను న్యాయమూర్తి ఈ రోజుకు వాయిదా వేశారు. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు చేపట్టారు.

రాజధానికి సంబంధించి బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, దానిని అనుసంధానించే రోడ్ అలైన్ మెంట్‌లో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత ఏడాది ఏప్రిల్ 27న ఫిర్యాదు ఇచ్చారు. దీంతో మే 9న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబు ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ యువనేత నారా లోకేశ్ కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. అక్టోబర్ 4వ తేదీ వరకు బెయిల్ ఇచ్చింది. అప్పటి వరకు లోకేశ్ ను అరెస్ట్ చేయవద్దని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను 5వ తేదీకి వాయిదా వేసింది.

మరోవైపు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో నారా లోకేశ్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది. ఈ కేసులో విచారణను అక్టోబర్ 4 వరకు వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. మరోవైపు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ కు 41ఏ నోటీసులు ఇవ్వాలని సీఐడీని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు ... ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు బూటకమని టీడీపీ నేత, మాజీ మంత్రి పి.నారాయణ అన్నారు.

ఈడుపుగల్లులో 2001లో 40 సెంట్ల భూమిని కొనుగోలు చేశానని... ఇప్పుడు దాని విలువ రూ. 7 కోట్లని... ఆ భూమి కూడా ఇన్నర్ రింగ్ రోడ్డులో పోయిందని తెలిపారు. సొంత భూమిని కోల్పోయిన తనపైనే రివర్స్ లో తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. తమపై వచ్చిన ఆరోపణల్లో నిజమేమిటనేది కోర్టుల్లో తేలుతుందని చెప్పారు. న్యాయస్థానంలో తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని అన్నారు. భువనేశ్వరి, బ్రాహ్మణిలతో కలిసి జైలులో ఉన్న చంద్రబాబును నారాయణ ఈరోజు కలిశారు. ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 21 రోజులుగా జైల్లో ఉన్నప్పటికీ మనోధైర్యాన్ని కోల్పోలేదని నారాయణ అన్నారు. హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతికి సంతాపం తెలియజేయమన్నారని వెల్లడించారు.


చంద్రబాబు అరెస్ట్ అక్రమం అనే విషయం ప్రజలందరికీ అర్థమయిందని ... రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని నారాయణ మండిపడ్డారు. టీడీపీకి వస్తున్న ప్రజాదరణను అణచి వేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం చేస్తున్న పనులతో టీడీపీకి ఆదరణ పెరుగుతుందే తప్ప తగ్గదని అన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణను రూపొందించి ముందుకు సాగుతాయని చెప్పారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos