రాష్ట్రంలో రైతులకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమాలను ఆపకపోతే 175 కాదు కదా ఒక్క సీటు కూడా గెలవనివ్వమని ఏపీ రైతు సంఘం వైసీపీ సర్కార్ కు హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తోందని.. ఇవేగనుక కంటిన్యూ చేస్తే... రానున్న ఎన్నికల్లో అన్నదాతలంతా కలిసి జగన్ ను ఓడిస్తారని మాజీ మంత్రి, ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు హెచ్చరించారు. విజయవాడ ధర్నాచౌక్ లో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికి మహాధర్నా నిర్వహించారు.

ఈ  సందర్భంగా శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు తీసుకు వస్తోందని, విద్యుత్తు సంస్కరణలను ప్రతిపాదిస్తోందని, సహకార రంగాన్ని కబళించేందుకు ప్రయత్నిస్తోందని... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీటన్నింటికీ వంతపాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని మండిపడ్డారు. విజయ డెయిరీని అమూల్ పరం చేయవద్దని డిమాండ్ చేశారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో నరేంద్ర మోదీకి వంతపాడే వారిని ఓడించాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు.


ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడం వరకే పరిమితం అవుతున్నారని... సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీపీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి పి. మధు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల పేరుతో రైతుల గొంతు కోస్తోందని మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ... రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని, స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తే 175 కాదు కదా... ఒక్క సీటూ గెలవనివ్వమని తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos