తెలుగు సినీ ఇండస్ట్రీలో ముద్దుగా బ్రహ్మీగా పిలుచుకునే ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం స్క్రీన్ పై నటించాల్సిన అవసరం లేదు... ఆయన తెరపై కనిపిస్తే చాలు... ప్రేక్షకుల్లో నవ్వు తన్నుకొస్తుంది. ప్రతిసారీ తన హావభావాలతో ప్రేక్షకులను నవ్వించే బ్రహ్మానందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఆయనకు ఉన్న పేరును ... స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో మీమ్స్ తో సైతం ఆయన కామెడీ రథం కొనసాగుతోంది. తాజాగా ఆయన పేరు ఇప్పుడు వార్తల్లో నానుతోంది. బ్రహ్మానందంకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గౌతమ్ సినీ పరిశ్రమలోకి ‘పల్లకిలో పెళ్లి కూతురు’ చిత్రంతో హీరోగా అడుగుపెట్టగా తర్వాత అంతగా సక్సెస్ కాలేకపోయాడు. బాసంతి, చారుశీల, మను వంటి చిత్రాల్లో నటించిన గౌతమ్ కు హీరోగా అంతగా గుర్తింపు దక్కలేదు. అతను పెళ్లి చేసుకొని అమెరికాలో స్థిరపడ్డారు. చిన్న కుమారుడు సిద్ధార్ధ్ సినిమా ఇండస్ట్రీ వైపు పెద్దగా ఆసక్తి చూపించలేదు. తాజాగా సిద్ధార్ధ్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల పుత్రిక ఐశ్వర్యతో ఆయన ఏడడుగులు నడిచారు. సిద్ధార్థ, ఐశ్వర్యల వివాహం గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్వయ కన్వెన్షన్స్ లో జరిగింది. ఐశ్వర్య డాక్టర్ గా పని చేస్తున్నారు. ఈ పెళ్లి వేడుక కోసం బ్రహ్మానందం ... సినీ, రాజకీయ ప్రముఖులు అందరినీ ఆహ్వానించారు. ఈ వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రితోపాటు ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త సుబ్బిరామిరెడ్డి, సినీ ప్రముఖులు బాలకృష్ణ, మోహన్ బాబు, మురళీ మోహన్, చిరంజీవి సతీమణి సురేఖ, పెద్దమ్మాయి, పవన్ కల్యాణ్, రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాస రావు, రాజశేఖర్, జీవిత దంపతులు, రామ్ చరణ్ ఉపాసన దంపతులు, శ్రీకాంత్ ఫ్యామిలీ, సాయి కుమార్ ఫ్యామిలీ, మంచు విష్ణు దంపతులు, మంచు మనోజ్ దంపతులు హాజరై విషెస్ చెప్పారు. వీరితో పాటుగా దర్శకులు కోదండరామిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, శేఖర్ కమ్ముల, నటులు రావు రమేష్, ఆలీ ఫ్యామిలీ, ఎల్బీ శ్రీరామ్, నిర్మాతలు శివలెంక కృష్ణ ప్రసాద్, బెల్లంకొండ సురేష్, అచ్చిరెడ్డి, ఆదిశేషగిరిరావు, కేఎల్ నారాయణ, రఘు బాబు తదితరులు హాజరయ్యారు. బ్రహ్మానందం టాలీవుడ్ లో ప్రతి ఒక్కరికి ఆత్మీయులు కావడంతో ఇండస్ట్రీలో చిన్నస్థాయి నటుల నుంచి స్టార్స్ వరకు అందరూ ఈ పెళ్లి వేడుకకి హాజరు కావడం విశేషం.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos