వై ఏపీ నీడ్స్ జగన్ -20

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేకుండా వ్యవహరిస్తున్నారు. ప్రతి బహిరంగ సభలోను నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చిలుక పలుకులు పలుకుతూ వారిని మోసం చేస్తున్న జగన్ ... అదేవిధంగా కాపు సోదరులను సైతం  ఈ ఐదేళ్లలో దగా చేశారు. టిడిపి ప్రభుత్వంలో అమలు చేసిన కాపుల అభివృద్ధి, సంక్షేమ పథకాలను జగన్ అధికారంలోకి వచ్చాక నేల రాశారు. అంతేకాదు నిరుద్యోగ యువతకు ఇచ్చే నైపుణ్యం శిక్షణకు అడ్డుపడటం, కాపు భవన నిర్మాణాలు చేపట్టకుండా వదిలేయడం, ఈ డబ్ల్యూ ఎస్ కోటాలో గత టిడిపి ప్రభుత్వం కాపులకు అమలు చేసిన రిజర్వేషన్లను రద్దు చేయడం వంటి ఎన్నో తిరోగమన పనులకు ఒడిగ ట్టారు. కాపులకు గత టిడిపి ప్రభుత్వంలో అమలైన విదేశీ విద్య పథకం పై కూడా జగన్ ఎన్నో కుతంత్రాలు చేశారు. 2014 - 19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఈ పథకం కింద 1,892 మంది విద్యార్థులను ఉన్నత విద్య చదివేందుకు విదేశాలకు పంపింది. అదే వైసిపి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసే విధానం గందరగోళానికి దారి తీసింది. తొలుత 200 క్యూ ఎస్ ర్యాంకింగ్ ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీటు సాధిస్తేనే ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించింది. ఆ తర్వాత నిబంధనలను మరింత కఠినతరం చేసి సబ్జెక్టుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ విధంగా ఏదో ఒక కొర్రి పెట్టి విదేశాలకు వెళ్లే కాపు విద్యార్థుల సంఖ్యను భారీగా తగ్గించేసింది. మరోవైపు  కాపు భవన్ ల నిర్మాణంలో జగన్ సర్కారు చూపిస్తున్న అలసత్వం తీవ్రస్థాయిలో ఉంది. గత టిడిపి ప్రభుత్వం కాపు భవన్ ల నిర్మాణానికి తీసుకున్న చర్యలతో పోలిస్తే ఇప్పటి ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని చెప్పాలి. అప్పటి టిడిపి ప్రభుత్వం చేపట్టగా మిగిలిన భవనాల నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం వదిలేసింది. దీంతో జగన్ ప్రభుత్వం పై కాపులు తీవ్రంగా మండిపడుతున్నారు. మాకు దారుణంగా అన్యాయం చేసిన జగన్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయాలని వారు నిలదీస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos