ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీవర్షాల కారణంగా ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. వరుసగా ఐదోరోజు కూడా భారీగా వర్షాలు కురుస్తుండటంతో యమునా నది మహోగ్రరూపం దాల్చింది. పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలతో ఉన్నారు. 1978 నాటి 207.49 మీటర్లను అధిగమించి 208.46 మీటర్ల స్థాయిలో వరదనీరు ప్రవహిస్తోంది. అంటే 45 ఏళ్ల రికార్డును మించి ప్రవహిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు గుమికూడటంపై అధికారులు నిషేధం విధించారు.  ఇప్పటికే చరిత్రలో ఆల్ టైమ్ రికార్డులు తిరగరాసిన యమునా నది వరద ఇప్పుడు ఏకంగా ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ ఇంటి సమీపానికి వచ్చేసింది. ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న వంతెనల్ని సైతం తాకుతూ ప్రవహిస్తోంది. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్దితి నెలకొంది.

యమునా నదికి సమీపంలోని ఇళ్లు, మార్కెట్లలోకి నీరు చేరడంతో వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నీటి మట్టం మరింత పెరిగే అవకాశముందని అంచనా వేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దేశ రాజధానిలో భారీ వర్షాలు పడనప్పటికీ, హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నీటిని నదిలోకి నిరంతరాయంగా విడుదల చేస్తుండటంతో యమునాలో నీటిమట్టం రికార్డు స్థాయిలో 208.46 మీటర్లకు చేరుకుంది. ఇది ప్రమాదకర స్థాయి కంటే మూడు మీటర్ల ఎత్తులో ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. పరిస్ధితి తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్... కేంద్రం జోక్యం చేసుకుని హత్నికుండ్ బ్యారేజీ నుండి నీటి విడుదలను నిలిపివేయాలని కోరింది. కానీ దీనికి కేంద్రం ఒప్పుకోవడం లేదు. వరదల నేపథ్యంలో ఢిల్లీలో అనేక మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు కేజ్రీవాల్ హెచ్చరికలు జారీ చేశారు. తక్షణమే నివాస ప్రాంతాలు ఖాళీ చేయాలన్నారు. యమునా నది ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించి... సహాయ చర్యలను పర్యవేక్షించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు. పాఠశాలలను పునరావాస శిబిరాలుగా మార్చాలని అధికారులను సీఎం ఆదేశించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos