వెస్టిండీస్ తో రెండుమ్యాచ్ ల టెస్ట్ లీగ్ తొలిపోరులో భారత ఓపెనర్లు సెంచరీలతో చెలరేగిపోయారు. డొమానికాలోని విండ్సర్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్ రెండోరోజు ఆటలో సైతం భారత్ ఆధిపత్యమే కొనసాగింది. డొమానికా టెస్టుతో అరంగేట్రం చేసిన 21 సంవత్సరాల భారత యువఓపెనర్ యశస్వి జైశ్వాల్ రెండోరోజు మొత్తం బ్యాటింగ్ కొనసాగించడ ద్వారా 143 పరుగుల అజేయ స్కోరు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 14 బౌండరీలు ఉండటం గమనార్హం. తనకు ఇది ఒక ఎమోషనల్ మూమెంట్ అని జైశ్వాల్ చెప్పుకొచ్చాడు. 'ఈ సెంచరీ నాకు ఒక ఎమోషనల్ మూమెంట్ అని... నాపై నాకు చాలా గర్వంగా అనిపించిందని... ఇది ఆరంభం మాత్రమేనని... భవిష్యత్తులో కూడా బాగా రాణించేలాగా ఆడతానని జైశ్వాల్ చెప్పుకొచ్చాడు. టీమిండియాలో అవకాశాలు రావడం చాలా కష్టమని.. అయినా నాకు వచ్చింది... అందుకే అందరికీ ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నానంటూ టీం మేనేజ్‌మెంట్, కెప్టెన్ రోహిత్ శర్మ, ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్' అని జైశ్వాల్ చెప్పాడు.

ఇలా తను ఆడిన తొలి మ్యాచ్ లోనే సెంచరీతో చెలరేగడంతో జైశ్వాల్‌పై నలువైపుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ టెస్టు అరంగేట్రం మ్యాచ్ లోనే అజేయ సెంచరీతో హేమాహేమీల సరసన నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో జంటగా 229 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశాడు. భారత టెస్టు చరిత్రలో అరంగేట్రం టెస్టులోనే శతకం బాదిన మూడో భారత ఓపెనర్ గా యశస్వి రికార్డుల్లో చేరాడు. బ్యాటింగ్ కు.. ప్రధానంగా స్ట్ర్రోక్ ప్లేయర్లకు ఏమాత్రం అనువుకాని డొమానికా పిచ్ పైన భారత ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- యశస్వి జైశ్వాల్ మొదటి వికెట్ కు 229 పరుగుల భాగస్వామ్యంతో సరికొత్త రికార్డు నెలకొల్పారు. 21 ఏళ్ళ 197 రోజుల వయసులో... అత్యంత పిన్నవయసులో... టెస్టు అరంగేట్రం మ్యాచ్ లోనే సెంచరీ సాధించిన నాలుగో అత్యంత పిన్నవయస్కుడైన బ్యాటర్ గా యశస్వి జైశ్వాల్ రికార్డు నెలకొల్పాడు. క్రికెట్ పై పిచ్చితో ముంబై ఫుట్ పాత్ ల పైన పడుకొని, పానీపూరీలు అమ్మటం ద్వారా కడుపు నింపుకొన్న యశస్వీ జైశ్వాల్.. 21 సంవత్సరాల వయసుకే అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదగటం, టెస్టు క్రికెట్ అరంగేట్రంలోనే భారీశతకం బాదటం భారత క్రికెట్ విజయగాధల్లో ఒకటిగా మిగిలిపోతుంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos