ఏపీలో అప్పుల రాజకీయంతో అన్ని పార్టీలూ కుతకుతలాడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుచేస్తూ...  రాష్ట్రంపై అప్పుల భారం మోపుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేసినా... జగన్ పట్టించుకోకుండా ... సంక్షేమ పథకాల పేరిట నిధులను పప్పుబెల్లాల్లాగా పంచుకుంటూనే వెళుతున్నారు. ఈ క్రమంలో... ఇప్పుడు జగన్ సర్కార్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా అటాక్ మొదలుపెట్టారు.
అసలు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెళ్లిపోయాక ... పురందేశ్వరి వచ్చినప్పటి నుంచి తగ్గేదే లేదన్నట్లుగానే వ్యవహరిస్తూ... వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఆమధ్య ... ఏపీ ప్రభుత్వం ... రూ.10 లక్షల కోట్లు అప్పు చేసి 4 లక్షల కోట్లుగా చూపిస్తోందంటూ... ఏకంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆమె ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేశారు.  రాష్ట్ర ప్రభుత్వ అధికారిక అప్పు రూ. 2,39,000 కోట్లు... అనధికారిక అప్పు రూ. 4,74,000 కోట్లు... అని ... కార్పొరేషన్ల పేరుతో అప్పులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం జగన్ .. కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు.
దీంతో వైసీపీ నేతలు కూడా రియాక్ట్ అయి... పురందేశ్వరిపై కౌంటర్ అటాక్ స్టార్ట్ చేయడంతో రాష్ట్రంలో పొలిటికల్‌గా వేడి పెరిగిపోతోంది. పైగా... పురందేశ్వరిపై వ్యక్తిగతంగా కూడా అటాక్‌ మొదలు పెట్టారు వైసీపీ నేతలు. మరిది చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ని పురందేశ్వరి చదువుతున్నారంటూ ... మీరున్నది బీజేపీలోనే కానీ... టీడీపీలో కాదు చిన్నమ్మ గారూ అంటూ పురంధేశ్వరిపై సెటైర్లు వేస్తున్నారు.
కాగా... రాష్ట్రంలో అప్పులపై రెండు పార్టీల మధ్య రచ్చ కొనసాగుతున్న నేపథ్యంలో... లోక్‌సభలో ఎంపీ రఘురామ కృష్ణరాజు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి లోబడే ... ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫారసులకు లోబడే ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. 2019 మార్చి నాటికి ఏపీ అప్పులు రూ. 2,64,451 కోట్లు అని... 2023 నాటికి ఏపీ అప్పులు రూ. 4,42, 442 కోట్లకు చేరాయని.. నాలుగేళ్లలో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులు రూ. 1,77,991 కోట్లు అని నిర్మలా సీతారామన్‌ పేర్కొనడంతో.... ఇప్పుడు ఆమె మాటలనే అస్త్రాలుగా తీసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు బీజేపీ నాయకులపైనా... ఇతర ప్రతిపక్షాల వారిపైనా దాడులు చేస్తున్నారు. దీంతో  ఏపీలో ఇప్పుడు అప్పుల అంశం రాజకీయ సెగలు రాజేస్తోంది.
ఈ క్రమంలో... నిన్నటిదాకా వైసీపీ వర్సెస్‌ టీడీపీ, జనసేన అన్నట్లు పోరు సాగితే... ఇప్పుడు వైసీపీ- బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ వార్‌.. రాజకీయంగా ఎటు దారి తీస్తుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos