టీడీపీ అధినేత చంద్రబాబు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ తెలుగు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి ముందుకెళ్లే విధంగా చర్చలు జరిగాయంటూ ప్రచారం సాగుతోంది. అయితే ... కేవలం తెలంగాణలో మాత్రమే టీడీపీతో పొత్తుల అంశం తేల్చుకునేందుకు అమిత్ షా ... ఆగమేఘాల మీద చంద్రబాబును ఢిల్లీ పిలిపించుకుని చర్చించారని ఓ వర్గం చర్చించుకుంటోంది. ఈ ప్రచారం పైన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ... టీడీపీతో బీజేపీ పొత్తుకు సిద్ధమైందని వచ్చిన వార్తలు ఊహాగానాలేనని కొట్టిపారేశారు.
అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను ... చంద్రబాబు కలిస్తే తప్పేముందని ... దేశ, రాష్ట్రాల అభివృద్ధి కోసం గతంలో మమతా బెనర్జీ, స్టాలిన్, నితీశ్ కుమార్ వంటి ప్రతిపక్ష నేతలను ప్రధాని మోదీ, అమిత్ షా కలిశారని గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని... రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలంతా కలిసే పోటీ చేయబోతున్నాయని వెల్లడించారు. ప్రజలు బీఆర్‌ఎస్ పాలన పట్ల విసిగిపోయారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతుండడంతో... దాన్ని దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్‌తోపాటు మరికొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నెలాఖరు వరకు జరిగే ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని నేతలకు బండి పిలుపునిచ్చారు. బీజేపీ నాయకత్వానికి తెలంగాణ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావటంతో ... అక్కడ టీడీపీతో పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయంటూ ప్రచారం సాగుతోంది.
అయితే ... ఏపీ విషయంలోనూ స్పష్టత వచ్చిన తరువాతనే ఈ పొత్తు ప్రతిపాదనల పైన భవిష్యత్ నిర్ణయాలు ఉంటాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. పొత్తు రెండు పార్టీలకు మేలు చేసేదిగా ఉండాలని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు జరిగిన చర్చలకు సంబంధించి రెండు పార్టీల నుంచి అధికారికంగా ఎవరూ స్పందించలేదు. ఏపీలో సీఎం జగన్ కు బీజేపీ అగ్రనాయకత్వం అనుకూలంగా ఉందనే ప్రచారం జరుగుతున్న సమయం లో టీడీపీతో పొత్తు ... ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీస్తుందా అని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. 8న అమిత్ షా, 10న నడ్డా ఏపీలో జరగనున్న పర్యటనల్లో కానీ... ఆ తరువాత కానీ పొత్తులపైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోందని వారు అంటున్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ తెలుగు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి ముందుకెళ్లే విధంగా చర్చలు జరిగాయంటూ ప్రచారం సాగుతోంది. అయితే ... కేవలం తెలంగాణలో మాత్రమే టీడీపీతో పొత్తుల అంశం తేల్చుకునేందుకు అమిత్ షా ... ఆగమేఘాల మీద చంద్రబాబును ఢిల్లీ పిలిపించుకుని చర్చించారని ఓ వర్గం చర్చించుకుంటోంది. ఈ ప్రచారం పైన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ... టీడీపీతో బీజేపీ పొత్తుకు సిద్ధమైందని వచ్చిన వార్తలు ఊహాగానాలేనని కొట్టిపారేశారు. అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను ... చంద్రబాబు కలిస్తే తప్పేముందని ... దేశ, రాష్ట్రాల అభివృద్ధి కోసం గతంలో మమతా బెనర్జీ, స్టాలిన్, నితీశ్ కుమార్ వంటి ప్రతిపక్ష నేతలను ప్రధాని మోదీ, అమిత్ షా కలిశారని గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని... రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలంతా కలిసే పోటీ చేయబోతున్నాయని వెల్లడించారు. ప్రజలు బీఆర్‌ఎస్ పాలన పట్ల విసిగిపోయారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతుండడంతో... దాన్ని దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్‌తోపాటు మరికొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నెలాఖరు వరకు జరిగే ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని నేతలకు బండి పిలుపునిచ్చారు. బీజేపీ నాయకత్వానికి తెలంగాణ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావటంతో ... అక్కడ టీడీపీతో పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయంటూ ప్రచారం సాగుతోంది.
అయితే ... ఏపీ విషయంలోనూ స్పష్టత వచ్చిన తరువాతనే ఈ పొత్తు ప్రతిపాదనల పైన భవిష్యత్ నిర్ణయాలు ఉంటాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. పొత్తు రెండు పార్టీలకు మేలు చేసేదిగా ఉండాలని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు జరిగిన చర్చలకు సంబంధించి రెండు పార్టీల నుంచి అధికారికంగా ఎవరూ స్పందించలేదు. ఏపీలో సీఎం జగన్ కు బీజేపీ అగ్రనాయకత్వం అనుకూలంగా ఉందనే ప్రచారం జరుగుతున్న సమయం లో టీడీపీతో పొత్తు ... ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీస్తుందా అని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. 8న అమిత్ షా, 10న నడ్డా ఏపీలో జరగనున్న పర్యటనల్లో కానీ... ఆ తరువాత కానీ పొత్తులపైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోందని వారు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos