ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ అవార్డుల వేడుక నిర్వహించిన సందర్భంగా... సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావును, చంద్రమోహన్‌, బాబుమోహన్‌ తదితరులను ఘనంగా సత్కరించారు. ఈ వేదికపై కోట మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ పారితోషికం పై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈమధ్యకాలంలో సినిమా నటులకు ఏది పబ్లిక్ గా మాట్లాడాలో... ఏది మాట్లాడకూడదో తెలియడం లేదని .. ఇవాళ సినిమా అనేది అంతా సర్కస్ ఫీట్ల లాగా తయారైందని అన్నారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే... ఇప్పటి హీరోలు... వారు తీసుకుంటున్న పారితోషికం అమౌంట్ ఎంతోకూడా.. బహిరంగంగా చెబుతున్నారని... రోజుకి 2కోట్లు, 6కోట్లు తీసుకుంటున్నామని.. 40 రోజుల షూటింగ్ అని పబ్లిక్‌గా చెబుతున్నారని... ఇది మంచి పద్థతి కాదని .... ఆయన వ్యాఖ్యానించారు. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌ బాబు సినిమాకు ఎంత రెమ్యునరేషన్‌ తీసుకున్నారో తెలుసా? వాళ్లు ఏనాడూ వారి పారితోషికం గురించి బాహాటంగా చెప్పలేదని అన్నారు.

ఇప్పటి సినిమాల్లో విషాదకర పాటలకు కూడా డాన్స్‌లు వేస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్‌ శ్రీదేవితో డాన్స్‌ చేస్తుంటే ఆయన వయసు గురించి ఎవరూ మాట్లాడలేదు. అప్పుడు జనాలు తెరపై ఆ పాత్రలు మాత్రమే కనిపించాయి. ఇప్పుడు నాలాంటి వాడు అలా డాన్స్‌లు చేస్తే ముసలోడు అంటారు’’ అని అన్నారు. అలాగే ‘మా’ అసోసియేషన్‌ గురించి కూడా ఆయన మాట్లాడారు. ‘ఎంతమంది ఆర్టిస్ట్‌లు రెండు పూట్ల కడుపునిండా అన్నం తింటున్నారో ఓసారి దృష్టిసారించండి అని మా అధ్యక్షుడు మంచు విష్ణుని కోరారు.

పూర్తిగా తెలుగు ఆర్టిస్ట్‌లు, సాంకేతిక నిపుణులతో పది కోట్లతో సినిమా తీస్తే.. ఆ సినిమాకు ప్రభుత్వం నుంచి డబ్బు ఇవ్వద్దు.. రాయితీలు ఇవ్వద్దు. ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ షూటింగ్‌ జరిగినా ప్రభుత్వ, తదితర లొకేషన్స్‌ ఉచితంగా ఇస్తాం’ అని ప్రకటించమని ప్రభుత్వానికి ఓ లెటర్‌ రాయండి’’ అని అన్నారు. ప్రస్తుతం చిన్న ఆర్టిస్టులు బతకలేకపోతున్నారని... దయచేసి ‘మా’ సభ్యులు, ప్రభుత్వాలు ఆలోచన చేసి ఆర్టిస్ట్‌లను బతికించండి’’ అని కోటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. కాగా... కోట శ్రీనివాసరావు... పవన్‌పై విమర్శలు చేయడం పట్ల అభిమానులు, నెటిజన్లు మండిపడుతున్నారు. పారితోషికాలు బయట పెట్టడం, పెట్టకపోవడం  వారి వ్యక్తిగత విషయమని.. మధ్యలో మీకెందుకంటూ.. కోటని ట్రోల్‌ చేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos