తెలంగాణ రాజకీయాల్లో చాలాకాలంగా కొనసాగుతున్న జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ల రాజకీయ ఊగిసలాటకు ఒక క్లారిటీ లభించినట్లేనని తెలుస్తోంది. ఇన్నాళ్లుగా ఉన్న ఉత్కంఠకు తెరదించుతూ వారిద్దరూ ఓ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వివిధ వర్గాలు, స్నేహితులు, అభిమానులతో చర్చల అనంతరం ఈ ఇద్దరి నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల తరువాత ఒక్క తెలంగాణలోనే కాదు... దేశవ్యాప్తంగా సమీకరణలు మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కూడా జోష్ కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఆ పార్టీపై పాజిటివ్‌ ధోరణితో ఉన్న ఈ నేతలిద్దరూ ... ఎట్టకేలకు కాంగ్రెస్ లోకే తమ ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నారు. అయితే వారి కండీషన్ ఏమిటంటే... వారితోపాటు వారి అనుచరులకు టికెట్లు కేటాయిస్తే చేరేందుకు సిద్ధమని ... కాంగ్రెస్ అధిష్ఠానంతో చాలారోజులుగా ఈ చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఈ విషయంపై సుదీర్ఘ మంతనాలు జరిపిన కాంగ్రెస్ అధినాయకత్వం ... చివరాఖరుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.  అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల మూడోవారంలో కానీ ... నెలాఖరుకు కానీ జూపల్లి, పొంగులేటి ... కాంగ్రెస్ లో చేరుతారని అంటున్నారు.

ప్రస్తుతం రాహుల్ గాంధీ అమెరికా టూర్‌లో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఓ డేట్‌ ఫిక్స్ చేసుకుంటారని... ఆ తర్వాత ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని సమాచారం. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక్కటే డిసైడ్ చేసుకున్నారు. ఏమిటంటే.... ఎవరు పార్టీలోకి వస్తామన్నా తీసుకోవాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. ఇందులోభాగంగానే ఆయన నేరుగా పేర్లు పెట్టి మరీ పిలుస్తున్నారు.

అయితే పార్టీలో చేర్చుకోవడం వరకూ ఓకే కానీ వారికి టిక్కెట్లు కేటాయించే అంశంలో రేవంత్ రెడ్డి హామీ ఇవ్వలేకపోతున్నారు. టిక్కెట్ల కేటాయింపు ఆయన చేతుల్లో ఉండదు కాబట్టి... ఆయన ఆ పని చేయలేకపోయారు. జాతీయ స్థాయి నాయకుల హామీ లభించిందు వల్లనే... ఇప్పుడు పొంగులేటి, జూపల్లి ... కాంగ్రెస్ లో చేరబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  కచ్చితంగా అభ్యర్థిత్వం ఇవ్వాల్సిందే అనుకున్న నేతలు వస్తామంటే కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఆలోచించదని ఈ ఎపిసోడ్‌తో అర్థమైంది. ఎంపీ టిక్కెట్ మీద పోటీ చేయాలంటే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉండాలని షరతు పెడుతున్నారు. అలాంటి నేతలకు టికెట్లు ఇచ్చేందుకు రెడీగానే ఉన్నామంటూ ఢిల్లీ నేతలు హామీ ఇస్తున్నారు.

బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తొలుత సొంత పార్టీ ఆలోచన చేశారు కానీ... ఎన్నికలకు సమయం దగ్గర పడినందున అలాంటి ప్రయత్నం చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావించి ప్లాన్ మార్చారు. అందుకే  కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపారు.  అటు బీజేపీ కూడా వీళ్లిద్దర్నీ చేర్చుకునేందుకు ప్రయత్నించింది కానీ చేర్చుకోవడంలో విఫలమైంది. ఆ పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ రంగంలోకి వీళ్లతో మంతనాలు జరిపారు. బీఆర్‌ఎస్‌తో లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయని... అనుకున్నంత బలంగా బీజేపీ లేదన్న కారణాలతో వాళ్లు ఈటల ఆఫర్‌ను తిరస్కరించారని సమాచారం. సో... ఇక జూపల్లి, పొంగులేటి కి కాంగ్రెస్ లో సీట్లు కన్ఫర్మ్ అయ్యాయని అర్థం చేసుకోవచ్చన్నమాట.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos