త్వరలో పలు రాష్ట్రాల అసెంబ్లీల తో పాటు లొక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... బీజేపీ అలర్ట్ అయింది. .తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆ పార్టీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. కేంద్రంలో వరుసగా మూడో సారి అధికారం దక్కించకొనే దిశగా హ్యాట్రిక్ విజయం కోసం పావులు కదుపుతోంది. అందులో భాగంగా దక్షిణాదిన ఎక్కువ సట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీ, తెలంగాణలోనూ ఈ సారి లోక్ సభ అభ్యర్దుల ఫైన వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఏపీలోని కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందను పార్లమెంట్ ఎన్నికల బరిలో దింపాలని బీజే పీ భావిస్తోంది. అన్నీ ఓకే అయితే... వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. హిందుత్వ అజెండాతో మత వ్యాప్తి దిశగా స్వామి పరిపూర్ణానంద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ గెలుపు కోసం కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇన్ ఛార్జ్ గా పని చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటే గెలిచినా ఓట్ల శాతం పెరిగింది. ఆ తరువాత పార్టీ విస్తరణకు.ప్రచారం కొనసాగించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో నిజాబామాద్, ఆదిలాబాద్ పరిధిలో చేసిన ప్రచారం..హిందుత్వ సభల ద్వారా అనూహ్యంగా బీజేపీకి మద్దతు పెరిగింది. ఫలితంగా ఆ ఎన్నికల్లో బీజేపీ నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. ఈ సారి ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి బీజేపీ అభ్యర్దిగా స్వామి పరిపూర్ణానంద పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ నాయకత్వంతో సత్సంబంధాలు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పరిపూర్ణానంద సన్నిహితంగా ఉంటారు. తెలంగాణలో కాంగ్రెస్ 12 ఎంపీ స్థానాలు గెలుస్తుందని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి సిట్టింగ్ సీట్లతో పాటుగా మల్కాజ్ గిరి, చేవెళ్ల ఖచ్చితంగా గెలవాలని బీజేపీ టార్గెట్ గా ఫిక్స్ చేసింది. దీంతో, మల్కాజ్ గిరి లేదా ఏపీలోని హిందూపూర్ స్థానాల్లో స్వామి పరిపూర్ణానంద పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు... ఏపీలోని హిందూపురంలో హిందూ మత ప్రచారం, వ్యాప్తిలో స్వామి పరిపూర్ణానంద కొంత కాలంగా యాక్టివ్ గా ఉన్నారు. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దు కావటం..దక్షిణాది రాష్ట్రాలు, భాషల్లో పట్టుుండటం ఆయనకు కలిసొచ్చే అంశం. టీడీపీతో బీజేపీ పొత్తు ఖాయమని భావిస్తున్న స్వామి పరిపూర్ణానంద కు సీటు కేటాయింపు అంశం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది. ప్రస్తుతం అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ వేడుకల్లో స్వామి పరిపూర్ణానంద పాల్గొంటున్నారు. ఈ వేడుక తరువాత సీట్ల కేటాయింపు గురించి బీజేపీ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని అంటున్నారు.మరోవైపు... ఓటమి భారం తో కుంగి పోతున్న బీఆర్ఎస్ అదినేత కేసీ అర్ ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ఓటమి మహా చెడ్డది. ఎంతటోడినైనా సరే.. పలుచన చేసేస్తుంది. ఇప్పుడు అలాంటి అనుభవాన్ని గులాబీ సారు సరికొత్తగా ఎదుర్కొంటున్నారా అంటే అవునని చెబుతున్నారు. అధినేత ఎదుట కూర్చునేందుకు సైతం సంశయించే కుటుంబ సభ్యులు సైతం ఈ మధ్యన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏం చేయాలన్న దానిపై కేసీఆర్ కు సూచనలు మీద సూచనలు చేస్తున్నారని సమాచారం. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసే ప్రపోజల్ పై పెద్ద ఎత్తున తర్జనభర్జనలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. బీజేపీతో కలిసి వెళితే.. పొత్తుల్లో బాగంగా తక్కువలో తక్కువ నాలుగైదు సీట్లలో తమ ఉనికిని చాటొచ్చన్న వాదన వినిపిస్తోంది. అందుకు భిన్నంగా ఒంటరిగా వెళితే.. తమ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయాన్ని గులాబీ బాస్ ముందు పెట్టగా.. ఆయన మాత్రం ససేమిరా అంటున్నారని తెలుస్తోంది. దీంతో .. ఇప్పుడెలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఆ పార్టీ ముఖ్యనేతలు కసరత్తులు చేస్తున్నారని తెలుస్తోంది. కేసీఆర్ పై వారు ఒత్తిడి తెస్తున్న తీరు.. ఆయనకు ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఇలాంటి అనుభవం కేసీఆర్ కు కొత్తదిగా చెప్పక తప్పదు. ఒకవేళ బీజేపీ తో కలసి వెల్లేవిధంగా ... బీ ఆర్ ఎస్ పార్టీ ప్రపోజల్ పెడితే కమలం పార్టీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos