గుడివాడ వైఎస్సార్సీపీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కొద్దిరోజులుగా నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేస్తున్న అధిష్టానం గుడివాడ సీటుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి పోటీ చేయడం ఖాయమని వైఎస్సార్సీపీ కేడర్ ధీమాతో ఉండటంతో పాటు నానికి తప్ప మరొకరికి అవకాశం ఉండదనే చర్చ జరుగుతున్న క్రమంలో గుడివాడలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. గుడివాడ వైఎస్సార్సీపీ అభ్యర్థి అంటూ మరో కొత్త వ్యక్తి పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ గుడివాడ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు సీఎంవో నుంచి పిలుపు వచ్చిందంటూ ఫోన్లలో వైఎస్సార్సీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.హనుమంతరావుకు శుభాకాంక్షలు చెబుతూ ప్రచారం జరుగుతోంది. దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడుగా ఆయనకు గుర్తింపు ఉందని.. అది కలిసొచ్చే అంశమని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో... ఒకవేళ హనుమంతరావు వైపు అధిష్టానం మొగ్గు చూపితే కొడాలి నాని పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos