వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏపీలో టీడీపీ - జనసేన మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. కూటమిలోకి బీజేపీని కూడా తెచ్చేందుకు టిడిపి అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. బీజేపీ ప్రస్తుతానికి సానుకూలంగానే ఉన్న నేపథ్యంలో అతి త్వరలో పొత్తులు, సీట్ల పంపకంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ... చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడొద్దని... అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తామని అన్నారు. జగన్ తీరుతో విసిగిపోయిన వైసీపీ నేతలు టీడీపీలో చేరుతామని వస్తున్నారని.. మంచివారు, పార్టీకి ఉపయోగపడతారని అనుకుంటేనే తీసుకుంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. రా .. కదలిరా సభలు ముగిశాక ప్రజాచైతన్య యాత్రను ప్రారంభిస్తానని ... ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రతి ఒక్కరూ సీరియస్‌గా పనిచేయాలని అన్నారు. బీసీ సాధికార సభలకు మంచి స్పందన వస్తోందని, ప్రతి నియోజకవర్గంలో ఈ సభలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్ మోహన్ రెడ్డి మోసం చేశారనే భావన ప్రతి ఒక్కరిలోనూ వుందన్నారు. చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తుండడంతో సర్వత్రా మంచి స్పందన వస్తుంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos