ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ కి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీకి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేసిన విషయాన్ని ఇంకా మరువక ముందే ... ఇప్పుడు మరో భారీ దెబ్బ తగిలింది. పార్టీకి చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బాబాాయి రూప్‌కుమార్ రాజీనామా చేశారు. మరో నలుగురు కార్పొరేటర్లు, మరికొందరు నేతలు కూడా అదే బాటలో నడిచారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే గుడ్ బై చెప్పాల్సి వచ్చిందని వారు అన్నారు. నెల్లూరు జిల్లా పార్టీలో ఏడాదిన్నరగా జరుగుతున్న పరిణామాలు తమను బాధించాయని... అందుకే పార్టీని వీడాల్సి వస్తోందని రూప్‌కుమార్ అన్నారు. కాగా బాబాయి రూప్‌కుమార్‌కు - అబ్బాయి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. తన అనుచరులపైనా దాడులు జరిగాయని రూప్‌కుమార్ ఆరోపించారు.. ఆ తర్వాత పార్టీలో ఎవరి పని వారు చేసుకుంటున్నారు. ఇంతలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను నెల్లూరు నుంచి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే నెల్లూరు సిటీ అభ్యర్థిగా డిప్యూటీ మేయర్ మహ్మద్ ఖలీల్ అహ్మద్ ను నియమించారు. ఇలా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఇంతలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనకు రూప్‌కుమార్ కూడా మద్దతు తెలిపి ... టీడీపీ నాయకుల్ని కూడా కలిశారు. ఈ క్రమంలో రూప్‌కుమార్ కూడా వేమిరెడ్డితో కలిసి ఈ నెల 2న టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద నెల్లూరు రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos