ఏపీలో సిద్ధం సభల పేరుతో వైసిపి ఇప్పటికే మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వాటిని నిర్వహించింది వైఎస్ఆర్సీపీ. విశాఖపట్నం జిల్లా భీమిలి, ఏలూరు జిల్లా దెందులూరు, అనంతపురం జిల్లా రాప్తాడుల్లో లక్షలాది మంది జనం మధ్య సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. ఇక నాలుగో సిద్ధం బహిరంగ సభను నిర్వహించడానికి వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం సమాయత్తమైంది. తొలుత మార్చి 3వ తేదీన బాపట్ల జిల్లాలోని అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల కొర్సిపాడు మండలం, పిచ్చికలగుడిపాడు జాతీయ రహదారి వద్ద చివరి విడతగా సిద్ధం మహాసభను నిర్వహించాలని నిర్ణయించింది. చివరి నిమిషంలో ఈ సిద్ధం సభ వాయిదా పడినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతుండటం, ఈ నెల 29వ తేదీన నిర్వహించ తలపెట్టిన నిధుల విడుదల కార్యక్రమాన్ని మార్చి 1 వ తేదీకి వాయిదా వేయడం వంటి కారణాల వల్ల సిద్ధం సభ వాయిదా పడినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి కొద్దిరోజుల ముందు అంటే మార్చి 10వ తేదీన చివరి విడత సిద్ధం బహిరంగ సభను నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పుడు నిర్వహించ తలపెట్టిన అదే ప్రదేశంలోనే  సభ ఉండొచ్చని చెబుతున్నారు. అదే సభలో మేనిఫెస్టోను సైతం జగన్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos